Share News

జపాన్‌లో మంచి మనసు చాటుకున్న భారతీయులు.. గాయపడ్డ వృద్ధుడిని..

ABN , Publish Date - Jan 20 , 2026 | 08:53 PM

రానా, అతడి స్నేహితుడు రోడ్డుపై గాయాలతో పడిఉన్న వృద్ధుడిని చూశారు. ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అతడికి ఫస్ట్ ఎయిడ్ చేశారు..

జపాన్‌లో మంచి మనసు చాటుకున్న భారతీయులు.. గాయపడ్డ వృద్ధుడిని..
Japanese commuter

ఓ భారతీయుడు దేశంకాని దేశంలో తన మంచి మనసు చాటుకున్నాడు. గాయపడ్డ వృద్ధుడికి సాయం చేశాడు. స్నేహితుడి సాయంతో ప్రథమ చికిత్స అందించాడు. ఈ సంఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండియాకు చెందిన రోహన్ రాణా అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి జపాన్‌లో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం ఓ వృద్ధుడు గాయాలతో రోడ్డుపై పడిపోయి ఉన్నాడు. ఆ రోడ్డుపై వెళ్తున్న వారంతా అతడ్ని చూస్తున్నారే తప్ప సాయం చేయడానికి ముందుకు రాలేదు.


అటువైపు వెళ్తున్న రానా, అతడి స్నేహితుడు రోడ్డుపై గాయాలతో పడిఉన్న వృద్ధుడిని చూశారు. ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అతడికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. దీంతో ఆ వృద్ధుడు కోలుకున్నాడు. రానా, అతడి స్నేహితుడు చేసిన సాయానికి గాను కృతజ్ఞతగా డబ్బులు ఇవ్వాలని చూశాడు. అయితే, ఆ ఇద్దరు ఆ డబ్బుల్ని తీసుకోలేదు. ఆ వృద్ధుడు వారి మంచితనానికి సంతోషించాడు. ‘మీరు ఎక్కడినుంచి వచ్చారు?’ అని అడిగాడు. అప్పుడు రానా ‘ ఇండియా నుంచి వచ్చాము’ అని చెప్పాడు. తర్వాత ముగ్గురూ కలిసి మెట్రో స్టేషన్ వైపుగా నడుచుకుంటూ వెళ్లిపోయారు.


రానా దీన్నంతా వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘మన ఇండియన్స్ పరువు కాపాడావు. ఆ వృద్ధుడికి సాయం చేసి.. డబ్బులు తీసుకోకుండా గొప్పోడివి అనిపించుకున్నావు’.. ‘భారతీయులు ఎక్కడికెళ్లినా భారతీయులే.. మంచి తనం మన నరనరాల్లో ఉంటుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రానాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

అబూ సలేంకు పెరోల్ ఇవ్వొద్దు.. ముంబై కోర్టుకు తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ సీఐడీ విప్లవాత్మక నిర్ణయం..

Updated Date - Jan 20 , 2026 | 09:08 PM