హోలీ స్పెషల్.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
ABN , Publish Date - Mar 02 , 2026 | 03:55 PM
హోలీని చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే, దీనిని జరుపుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఇంటర్నెట్ డెస్క్: హోలీ అంటే చాలా మందికి ఇష్టమైన పండుగ. ఈ రోజున చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అయితే, హోలీని జరుపుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, హోలీ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే చర్మం, కళ్ళు వంటి భాగాలు నష్టపోవడం, ఇర్రిటేషన్ ఏర్పడడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి, హోలీ రోజున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
హోలీ వేడుకల్లో సహజ రంగులను వాడటం మంచిది. మార్కెట్‌లో రసాయనాలతో కలిపిన రంగులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి, ఇంట్లోనే సహజ రంగులను తయారు చేసుకోవడం ఉత్తమం. పసుపు రంగు కోసం పసుపు పొడిని మొక్కజొన్న పిండి లేదా శనగపిండితో కలపాలి. ఎరుపు రంగు కోసం మందార పువ్వుల పొడి లేదా బీట్‌రూట్ తురుమును ఎండబెట్టి పొడి చేసి వాడవచ్చు.
ముందుగా శరీరమంతా నూనె రాసుకోవాలి. శరీరంపై ఏవైన గాయాలు ఉంటే వాటిపై తప్పనిసరిగా బ్యాండేజ్ వేసుకోవడం మంచిది. చర్మ సమస్యలు ఉంటే ముందుగా సంబంధిత ఆయింట్మెంట్ రాయాలి. ముఖానికి సన్‌స్క్రీన్ అప్లై చేయాలి.
రంగులు నేరుగా కళ్లలో పడకుండా ఉండేందుకు కళ్లజోడు పెట్టుకోవడం మంచిది. ఎదుటివారు రంగు చల్లేటప్పుడు కళ్లని మూయాలి. లేదంటే రంగులు కళ్లలో పడే అవకాశం ఉంటుంది. ఇది దురద, ఇన్ఫెక్షన్స్ సమస్యకు దారితీస్తుంది. కళ్లలో ఏదైనా పడితే చేత్తో రుద్దకూడదు. ఎందుకంటే అలా చేస్తే రంగులు ఇంకా లోపలికి పోయే ప్రమాదం ఉంది. ముందుగానే కళ్ల చుట్టూ నూనె రాయడం వల్ల కలర్స్ అంటుకున్నా త్వరగా పోతాయి.
హోలీ రోజున రంగులు గోళ్లకు అంటుకుని పాడవకుండా ఉండటానికి నెయిల్ పాలిష్ వేసుకోవడం చాలా మంచిది. ఇది గోళ్లపై ఒక రక్షణ పొరలా పనిచేసి రంగుల మరకలు పడకుండా కాపాడుతుంది.
అలాగే, హోలీ పండుగ రోజు రంగులు పడే అవకాశం ఉన్నందున పాత బట్టలు ధరించడం ఉత్తమం. పాత దుస్తులు ధరించడం వల్ల మరకల గురించి చింతించాల్సిన అవసరం ఉండదు .
అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తెలియకుండానే రసాయనాలు కలిగిన రంగులు మనపై పడే అవకాశం ఉంటుంది. రంగుల వల్ల అలెర్జీగా ఉంటే వెంటనే ఆ ప్రదేశాన్ని నీటితో బాగా కడగాలి. ఆ తరువాత ఐస్‌తో మర్దన చేయాలి లేదా పెరుగు రాయాలి. అలోవెరా జెల్ కూడా ఉపయోగించవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి
కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?
For More Latest News