Share News

ఈ బాస్ చాలా గ్రేట్.. ఉద్యోగులకు రూ.20 కోట్లతో ఖరీదైన బహుమతులు..

ABN , Publish Date - Feb 18 , 2026 | 06:11 PM

ఏ సంస్థ అయినా అభివృద్ధి పథంలో నడవాలంటే ఉద్యోగులే కీలకం. ఉద్యోగులు కష్టపడి, సమర్థవంతంగా పని చేస్తేనే కంపెనీకి లాభాలు వస్తాయి. కొందరు యజమానులు ఉద్యోగుల కష్టాన్ని గుర్తుంచుకుని వారికి తగిన బహుమతులు ఇస్తుంటారు.

ఈ బాస్ చాలా గ్రేట్.. ఉద్యోగులకు రూ.20 కోట్లతో ఖరీదైన బహుమతులు..
47 cars to employees

ఏ సంస్థ అయినా అభివృద్ధి పథంలో నడవాలంటే ఉద్యోగులే కీలకం. ఉద్యోగులు కష్టపడి, సమర్థవంతంగా పని చేస్తేనే కంపెనీకి లాభాలు వస్తాయి. కొందరు యజమానులు ఉద్యోగుల కష్టాన్ని గుర్తుంచుకుని వారికి తగిన బహుమతులు ఇస్తుంటారు. తాజాగా కేరళకు చెందిన ఓ కంపెనీ తమ ఉద్యోగులకు అదిరిపోయే ఖరీదైన బహుమతులను అందించింది ( HiLITE Group Kerala).


కేరళకు చెందిన హైలైట్ గ్రూప్ సంస్థను ప్రారంభించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉద్యోగులకు యాజమాన్యం అదిరిపోయే బహుమతులను అందించింది. రూ.20 కోట్లు విలువైన ఖరీదైన కార్లను ఉద్యోగులకు అందించింది. సంస్థ ప్రారంభించిన నాటి నుంచి సేవలందించిన 47 మందికి రూ.20 కోట్ల విలువైన లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చింది. రేంజ్ రోవర్, ఆడీ, క్యూ8, లాండ్ రోవర్ డిఫెండర్, టాటా హారియర్, స్కోడా, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా వంటి కార్లు ఉన్నాయి (47 cars to employees).


రిటైల్ స్పేస్ రంగంలో అగ్రగామిగా ఉన్న హైలైట్ గ్రూప్‌ను 1996లో ప్రారంభించారు (Corporate gifting India). ఈ సంస్థకు త్రిశూర్, కాలికట్‌లలో లగ్జరీ మాల్స్ ఉన్నాయి. మొత్తం పది వేల మంది ఉద్యోగులు ఈ సంస్థలో పని చేస్తున్నారు. 2030 నాటికి తమ సంస్థను మరింత విస్తరించి రెండు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఈ గ్రూప్‌నకు చెందిన మరో పది మాల్స్ నిర్మాణ దశలో ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

ఇమ్రాన్‌ హత్యకు కుట్ర.. మమ్మల్ని మొహ్సిన్ బెదిరిస్తున్నారు.. మాజీ ప్రధాని సోదరీమణుల ఆరోపణలు..


మీ దృష్టికి పరీక్ష.. ఈ పార్క్‌లో ఉన్న పక్షిని 27 సెకెన్లలో గుర్తించండి..

Updated Date - Feb 18 , 2026 | 06:11 PM