హెచ్-1బీ లాటరీ రాక.. రూ.40 లక్షల అప్పుతో భారత్‌కు..
ABN , Publish Date - Apr 29 , 2026 | 10:42 PM
హెచ్-1బీ వీసా రాకపోవడంతో భారత్‌కు తిరిగివచ్చిన ఒక టెకీ ఆవేదన నెట్టింట వైరల్‌గా మారింది. ఓవైపు రూ.40 లక్షల అప్పు, మరోవైపు జాబ్ లేకపోవడంతో తనకు మనశ్శాంతి కరువైందని సదరు టెకీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఉద్యోగం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో భారత్‌కు వచ్చానంటూ ఒక టెకీ నెట్టింట పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. తాను చెల్లించాల్సిన అప్పు రూ.40 లక్షలు ఉందంటూ ఆ టెకీ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో జాబ్ లభించడం కష్టంగా మారిందని అన్నారు.
‘నా వీసా కాలపరిమితి ముగిసింది. హెచ్-1బీ లాటరీలో మళ్లీ ఎంపిక కాలేదు. మా సంస్థకు భారత్‌లో బ్రాంచీలు లేవు. కాబట్టి కంపెనీలో అంతర్గత ట్రాన్సఫర్‌కు కూడా అవకాశం లేదు. దీంతో, చివరకు భారత్‌కు రావాల్సి వచ్చిందిజ యూఎస్‌లో రూ.1.8 కోట్ల వార్షిక శాలరీతో జాబ్ చేసే వాడిని. భారత్‌లో జాబ్ దొరకడం కష్టంగా ఉంది. ఇంటర్వ్యూలో చాలా క్లిష్టంగా ఉన్నాయి. అమెరికాలో అడగని కఠిన ప్రశ్నలకు ఇక్కడ అడుగుతున్నారు. అభ్యర్థులపై సంస్థల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ ఎక్కువగా ఉంది. అమెరికాలో పనిచేసిన అనుభవం ఉన్నా ఇక్కడ సరిపోకపోవడం ఆశ్చర్యంగా నిరాశగా ఉంది. ఇది చాలదన్నట్టు నేను రూ.40 లక్షల అప్పు చెల్లించాల్సి ఉంది. జాబ్ కూడా లేకపోవడంతో ఒత్తిడి ఎక్కువైంది. ప్రశాంతత కరువైంది’ అని చెప్పుకొచ్చారు.
టెక్ రంగ నిపుణులు అనేక మంది ఈ పోస్టుపై స్పందిస్తూ తమకు పలు సలహాలు ఇచ్చారు. అంచనాలు తగ్గించుకుని ముందు ఏదో ఒక జాబ్‌లో చేరాలని సూచించారు. కాస్త నిలదొక్కుకున్నాక మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నించాలని అన్నారు. ముందు ఏదైనా జాబ్ దొరికితే అప్పు భారం తగ్గుతుందని అన్నారు.