Share News

స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Feb 02 , 2026 | 06:33 AM

గత నాలుగు, ఐదు రోజులుగా బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం, వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరిగింది. దీంతో వాటి ధరలు కిందకు దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 2న) ధరల ఎలా ఉన్నాయో చూద్దాం..

స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

గత నాలుగు, ఐదు రోజులుగా బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం, వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరిగింది. దీంతో వాటి ధరలు కిందకు దిగి వచ్చాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది (Gold prices).


ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 2న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,60,570కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,47,190కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,60,720కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,47,340కి చేరుకుంది.


మరోవైపు ఇటీవల భారీగా పెరిగిన వెండి కూడా స్థిరీకరణకు గురవుతోంది. శుక్ర, శనివారాల్లో భారీగా పతనమైంది. ఒక దశలో రూ.4.25 లక్షలకు చేరిన కిలో వెండి రెండ్రోజుల్లో దాదాపు రూ.75,000 మేరకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ. 1,60, 570, రూ. 1, 47, 190

  • విజయవాడలో రూ. 1,60, 570, రూ. 1, 47, 190

  • ఢిల్లీలో రూ. 1,60, 720, రూ. 1, 47, 340

  • ముంబైలో రూ. 1,60, 570, రూ. 1, 47, 190

  • వడోదరలో రూ. 1,60, 620, రూ. 1, 47, 240

  • కోల్‌కతాలో రూ. 1,60, 570, రూ. 1, 47, 190

  • చెన్నైలో రూ. 1,60, 570, రూ. 1, 47, 190

  • బెంగళూరులో రూ. 1,60, 570, రూ. 1, 47, 190

  • కేరళలో రూ. 1,60, 570, రూ. 1, 47, 190

  • పుణెలో రూ. 1,60, 570, రూ. 1, 47, 190


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ. 3, 19, 900

  • విజయవాడలో రూ. 3, 19, 900

  • ఢిల్లీలో రూ. 3, 49, 900

  • చెన్నైలో రూ. 3, 19, 900

  • కోల్‌కతాలో రూ. 3, 49, 900

  • కేరళలో రూ. 3, 19, 900

  • ముంబైలో రూ. 3, 49, 900

  • బెంగళూరులో రూ. 3, 49, 900

  • వడోదరలో రూ. 3, 49, 900

  • అహ్మదాబాద్‌లో రూ. 3, 49, 900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి..

పాకిస్థాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్.. కుర్రాళ్లతో సచిన్, లక్ష్మణ్ చిట్‌చాట్..


ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 02 , 2026 | 06:34 AM