Mooli: ఈ ముల్లంగి బరువు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 15 , 2026 | 05:28 PM
చలికాలం వచ్చిందంటే మార్కెట్‌లో ముల్లంగి విరివిగా కనిపిస్తుంటాయి. సాధారణంగా మనం చూసే ముల్లంగి పెద్దసైజు కీరా, క్యారెట్ మాదిరిగా ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ముల్లంగికి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాల్లో (Healthy Food) ఒకటి ముల్లంగి (Radish). శీతాకాలంలో ముల్లంగి ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా మార్కెట్‌లో ముల్లంగి.. కీరా, క్యారెట్ సైజులో కనిపిస్తాయి. వాటి బరువు కూడా తక్కువే. తాజాగా ఒక రైతు(Farmer) చేతిలో ఉన్న ముల్లంగి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ముల్లంగి స్పెషల్ ఏంటో తెలుసా? 20 అంగుళాల మందం, 3.5 అడుగుల పొడవు. 12 కిలోల బరువుతో కూడిన ముల్లంగి.
ఈ వీడియోను @ChapraZila అనే ఖాతాలో X ఫ్లాట్ ఫామ్ లో పోస్ట్ చేశారు. ‘బీహార్‌లో సంక్రాంతి సందర్భంగా జరిగిన రైతు సంతకు 12 కిలోలు, 20 అంగుళాల మందం, 3.5 అడుగుల పొడవు ముల్లంగి తీసుకువచ్చారు.’ అనే శీర్షికతో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ముల్లంగికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు ఇదేం ముల్లంగిరా బాబూ.. ‘బాహుబలి ముల్లంగి’ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..