కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి.. వైర్లు కాపాడాయి..
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:50 PM
దేశ రాజధాని ఢిల్లీలోని స్వరూప్ నగర్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కుటుంబ వివాదం నేపథ్యంలో ఓ ఇంట్లో మంటలు ఎగసిపడ్డాయి. ఓ వ్యక్తి ఆ మంటల్లో చిక్కుకుపోయాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని స్వరూప్ నగర్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కుటుంబ వివాదం నేపథ్యంలో ఓ ఇంట్లో మంటలు ఎగసిపడ్డాయి. ఓ వ్యక్తి ఆ మంటల్లో చిక్కుకుపోయాడు. బయటకు రాలేని పరిస్థితిలో బాల్కనీలో ఓ మూలకు నిలబడ్డాడు. మంటలు వేగంగా అతడిని సమీపించసాగాయి. వేడి కారణంగా ఆ వ్యక్తి అల్లాడిపోయాడు. ప్రాణ భయంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. దేవుడా అంటూ తలబాదుకున్నాడు. పోలీసులు ఎంత ప్రయత్నించినా అతడిని పక్కకు తీసుకురావటం కుదరలేదు.
ఈ నేపథ్యంలోనే కింద ఉన్న ఓ వ్యక్తి అద్భుతమైన ఉపాయం చెప్పాడు. బాల్కనీ కింద ఉన్న వైర్ల మీద నుంచి పక్కింట్లోకి వెళ్లమన్నాడు. మంటల్లో చిక్కుకున్న వ్యక్తి ఏమాత్రం ఆలోచించకుండా సేఫ్టీ వాల్ దూకి వైర్ల మీదకు వచ్చాడు. మెల్లగా నడుచుకుంటూ పక్కింటి బాల్కనీ దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఉన్న పోలీసు ఆ వ్యక్తిని పైకి లాగాడు. వైర్ల కారణంగా కథ సుఖాంతం అయింది. రమేశ్ తివారీ అనే వ్యక్తి ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘వైర్లు ఇలా కూడా ఉపయోగపడతాయని, ఓ మనిషి ప్రాణాలు కాపాడతాయని నేను కలలో కూడా ఊహించలేదు’..‘ఐడియా అదిరింది. నిజం చెప్పాలంటే బాల్కనీ దగ్గర వైర్లు ఉండటం దేవుడి కృపే’..‘ఫైర్ సిబ్బంది రావటానికి అంత లేటు ఎందుకు అయ్యింది. ఫైర్ ఇంజిన్ వచ్చుంటే ఇంత కూడా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై బీజేపీ దాడి: నిరంజన్ రెడ్డి
డీఎంకే పార్టీపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఘాటు విమర్శలు