Share News

సైకిల్ తొక్కుతుండగా ఊడిపోయిన కృత్రిమ కాలు.. తర్వాత ఏం జరిగిందంటే..

ABN , Publish Date - May 26 , 2026 | 09:34 AM

మాల్టాలో మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని చెప్పే సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రోడ్డుపై ఇబ్బందిపడుతున్న వికలాంగుడికి సాయం చేశాడు.

సైకిల్ తొక్కుతుండగా ఊడిపోయిన కృత్రిమ కాలు.. తర్వాత ఏం జరిగిందంటే..
prosthetic leg cyclist

ఇంటర్‌నెట్ డెస్క్: మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని చెప్పే సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. ఓ వికలాంగుడు సైకిల్ తొక్కుతుండగా అతడి కృత్రిమ కాలు ఊడిపోయింది. సైకిల్ దిగిన వికలాంగుడు కాలు దగ్గరకు వెళ్లడానికి ఇబ్బందిపడసాగాడు. ఈ నేపథ్యంలోనే ఓ పాదచారుడు గొప్పమనసు చాటుకున్నాడు. రోడ్డుపై పడిపోయిన కృత్రిమ కాలును తీసుకువచ్చి వికలాంగుడికి అందించాడు. వికలాంగుడు కృత్రిమ కాలు ధరించడానికి సాయం కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మాల్టాకు చెందిన విన్‌సెంజో గరోఫాలో నావల్ ఇంజినీర్‌‌గా పని చేస్తున్నాడు.


గరోఫాలో కొంతకాలం క్రితం ప్రమాదంలో తన కుడికాలును మోకాలి కింది వరకు కోల్పోయాడు. ప్రస్తుతం కృత్రిమ కాలుతో జీవనం సాగిస్తున్నాడు. గరోఫాలో కొద్దిరోజుల క్రితం రోడ్డుపై సైకిల్ తొక్కుతుండగా కృత్రిమ కాలు ఊడిపోయింది. కాలు ఊడిపోగానే గరోఫాలో సైకిల్ ఆపేశాడు. ఒంటి కాలుతో సైకిల్ వెనక్కు తిప్పాడు. రోడ్డుపై పడ్డ కృత్రిమ కాలు దగ్గరకు చేరుకోవడానికి ఇబ్బందిపడసాగాడు. ఇంతలో అటువైపు వచ్చిన ఓ పాదచారి తన మంచి మనసు చాటుకున్నాడు. కృత్రిమ కాలును గరోఫాలో దగ్గరకు తీసుకువచ్చాడు. గరోఫాలో కాలు ధరించడానికి సాయం చేశాడు.


ఇందుకు సంబంధించిన వీడియోను గరోఫాలో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ‘నేను ఇలాంటి సంఘటనలను కేవలం వీడియోల్లో మాత్రమే చూశాను. కానీ, మొదటిసారి నా అనుభవంలోకి వచ్చింది. ఆ వ్యక్తికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా దయకలిగిన వ్యక్తి’ అని రాసుకొచ్చాడు. గరోఫాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి, 10మందికి పైగా గాయాలు..

మహేశ్వరరెడ్డి కేసులో కీలక మలుపు.. తోపుదుర్తి రాజారెడ్డి అరెస్ట్

Updated Date - May 26 , 2026 | 09:54 AM