ప్రియురాలికి కాస్ట్‌లీ వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చిన రొనాల్డో.. నెటిజన్ల విమర్శలు..
ABN , Publish Date - Mar 23 , 2026 | 03:09 PM
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ప్రియురాలు జార్జియా పెట్టిన పోస్టుపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది జార్జియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తన ప్రియురాలు జార్జియా రోడ్రిగేజ్‌కు తరచుగా కాస్ట్‌లీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. తాజాగా, ప్రియురాలికి ఏకంగా 6 కోట్ల రూపాయలు విలువ చేసే పటెక్ ఫిలిప్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. 65 కోట్ల రూపాయలు విలువ చేసే కారులో తమ ఇద్దరి చేతులకు ఉన్న వాచీలు కనిపించేలా జార్జియా ఓ ఫొటో తీశారు. ఆ తర్వాత హోటల్‌లో ఫుడ్ తింటున్న సమయంలో తన చేతికి ఉన్న వాచీని వీడియో కూడా తీశారు. ఫొటో, వీడియోను జార్జియా తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్టు చేశారు.
నెటిజన్ల ఆగ్రహం..
జార్జియా పెట్టిన పోస్టుపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది జార్జియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రపంచం మొత్తం యుద్ధం కారణంగా అల్లాడిపోతోంది. ఇలాంటి సమయంలో నువ్వు నీ వాచీకి సంబంధించిన ఫొటోను పోస్టు చేస్తున్నావు’..‘ఇక్కడ మీ ఇద్దరి మధ్యా ప్రేమ కంటే కాస్ట్‌లీ గిఫ్ట్‌లే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి’..‘ఇదంతా ఎగ్జిబిషన్‌లాగా అనిపిస్తూ ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది జార్జియాకు శుభాకాంక్షలు చెబుతున్నారు. క్రిస్టియానో లాంటి ప్రియుడు దొరకటం అదృష్టం అని అంటున్నారు.
సేల్స్ గర్ల్ టు మోడల్..
జార్జియా రోడ్రిగేజ్ 2016 వరకు మాడ్రిడ్ నగరంలోని గూచీ స్టోర్‌లో సేల్స్ గర్ల్‌గా పని చేశారు. ఆ స్టోర్‌కు వచ్చిన క్రిస్టియానోతో ఆమెకు పరిచయం అయింది. ఆ పరిచయం జార్జియా జీవితాన్నే మార్చేసింది. ప్రస్తుతం మోడలింగ్ రంగంలో జార్జియా మంచి గుర్తింపుతెచ్చుకున్నారు. క్రిస్టియానో, జార్జియా 2016 నుంచి సహజీవనం చేస్తున్నారు. ఇప్పటి వరకు పెళ్లి కూడా చేసుకోలేదు. ఈ జంట 2017లో ఓ పాపకు, 2022లో కవల పిల్లలకు జన్మనిచ్చింది. కొన్ని నెలల క్రితం ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.
ఇవి కూడా చదవండి
రాజకీయ పార్టీలకు ఈసీఐ ఉచిత ప్రసార సమయం.. డిజిటల్ వోచర్ల కేటాయింపు
పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడే విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు!