Share News

వామ్మో.. ఈ బుడ్డోడి తల్లిదండ్రులు ఎవరో గానీ..

ABN , Publish Date - Apr 29 , 2026 | 09:56 PM

ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్డుపై ఒక బుడతడు ప్రమాదకరంగా స్కూటీని నడిపిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. జనాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వామ్మో.. ఈ బుడ్డోడి తల్లిదండ్రులు ఎవరో గానీ..
Bengaluru child scooter viral video,

ఇంటర్నెట్ డెస్క్: పట్టుమని ఐదు అడుగులు కూడా లేని ఒక బుడ్డోడు ప్రమాదకర రీతిలో స్కూటీ నడుపుతున్న వీడియో వైరల్‌గా మారింది. దీనిపై బెంగళూరు పోలీసులు కూడా స్పందించారు.

కర్ణాటక పోర్ట్‌ఫోలియో అనే ఎక్స్ అకౌంట్‌లో ఈ వీడియో ట్రెండవుతోంది. వీడియోలో కనిపించినదాని ప్రకారం, ఒక బుడతడు స్కూటీని బిజీ రోడ్డులో ప్రమాదకరంగా నడిపాడు. సీటుపై కూర్చుని తొలగలిగేంత ఎత్తు కూడా లేని అతడు అలాగే డ్రైవ్ చేశాడు. స్కూటీని ఆపే క్రమంలో వాహనం నుంచి కిందకు దిగి దాన్ని నిలువరించేందుకు ట్రై చేశాడు. వాహనాన్ని అదుపు చేసేందుకు నానా యాతనా పడ్డాడు. ‘ఇదేమీ సాధారణ విషయం కాదు. నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనే కాకుండా బుడతడి ప్రాణాలకు ముప్పు. ఇలాంటి వారితో ఇతర వాహనదారులకు ప్రమాదమే అన్న కామెంట్‌తో వీడియోను ఈ అకౌంట్‌లో పోస్టు చేశారు.


ఈ వీడియో వైరల్‌ కావడంతో జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. బుడతడి తల్లిదండ్రులకు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని జనాలు డిమాండ్ చేశారు. చిన్న పిల్లాడికి వాహనాన్ని ఇవ్వడం అత్యంత బాధ్యతారాహిత్యమని విమర్శించారు. వీడియోపై బెంగళూరు పోలీసులు కూడా స్పందించారు. తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Apr 29 , 2026 | 10:08 PM