Share News

నా కూతురు ఇప్పుడో సీబీఐ ఆఫీసర్.. క్యాబ్ డ్రైవర్ ఆనందం

ABN , Publish Date - Apr 29 , 2026 | 08:33 PM

తన కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారంటూ ఒక క్యాబ్ డ్రైవర్ తెగ సంబరపడ్డారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

నా కూతురు ఇప్పుడో  సీబీఐ ఆఫీసర్.. క్యాబ్ డ్రైవర్ ఆనందం
Cab Drivers' Daughters Get Govt Job

ఇంటర్నెట్ డెస్క్: తన కూతుళ్లు ఇద్దరూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడాన్ని చూసి తెగ సంబరపడ్డ ఒక క్యాబ్ డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. క్యాబ్ డ్రైవర్ కారులోనే ప్రయాణించిన ఒక ప్యాసింజర్ ఈ ఆసక్తికర విషయాన్ని జనాలతో పంచుకున్నారు.

ఆ క్యాబ్ డ్రైవర్‌ పేరు ఉపేంద్ర గుప్తా అని ప్యాసింజర్ చెప్పుకొచ్చారు. జర్నీలో ఉండగా ఉపేంద్ర తన కూతుళ్ల గురించి చెప్పారని అన్నారు. ఆయన కూతుళ్లల్లో ఒకరు సీబీఐ ఆఫీసర్‌గా మరొకరు ఐఏఎస్‌గా ఎంపికయ్యారని చెప్పారు. ‘నేను చాలా ఆనందంగా ఉన్నాను. తల్లిదండ్రులకు ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు’ అని ఉపేంద్ర గుప్తా కామెంట్ చేశారని చెప్పారు. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఆయన కూతుళ్లు ఈ స్థాయికి చేరుకున్నారని చెప్పారు.


ఈ ఉదంతంపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. అనేక మంది ఆ క్యాబ్ డ్రైవర్‌ను ప్రశంసించారు. కష్టనష్టాలకు ఓర్చుకుని పిల్లల్ని పెద్ద చేసిన ఆ తండ్రి ఆనందాన్ని తమతో షేర్ చేసినందుకు ప్యాసింజర్‌కు కొందరు ధన్యవాదాలు కూడా తెలిపారు. మరికొందరేమో ఆ క్యాబ్ డ్రైవర్‌కు, ఆయన కూతుళ్లకు అభినందనలు తెలియజేశారు. ఆ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Updated Date - Apr 29 , 2026 | 08:53 PM