బైక్‌కు ట్రైన్ హారన్‌తో హల్‌చల్.. పోలీసులు ఏం చేశారంటే?
ABN , Publish Date - May 20 , 2026 | 07:55 AM
నేటి కాలంలో సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం కొందరు యువకులు ఎలాంటి వింత విన్యాసాలకైనా వెనుకాడటం లేదు. ఓ యువకుడు తన బైక్‌కు 'ట్రైన్ హారన్' అమర్చి రోడ్లపై హల్ చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: నేటి కాలంలో సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం కొందరు యువకులు ఎలాంటి వింత విన్యాసాలకైనా వెనుకాడటం లేదు. తాజాగా ఓ యువకుడు తన బైక్‌కు 'ట్రైన్ హారన్' అమర్చి రోడ్లపై హల్‌చల్ చేశాడు. రద్దీగా ఉండే వీధుల్లో హారన్ మోగిస్తూ అంతా ఉలిక్కిపడేలా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఓ యువకుడు తన బైక్‌కు రైలు హారన్‌ను అమర్చి.. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, కాలినడకన వెళ్లేవారిని ఉలిక్కిపడేలా చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వైరల్ వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సదరు యువకుడిని గుర్తించి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాహనాలకు అనుమతించదగిన స్థాయి కంటే ఎక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్లు లేదా హారన్లు అమర్చడం నేరమని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన
పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..