70 ఏళ్ల వృద్ధుడితో 22 ఏళ్ల యువతి పెళ్లి.. వైరల్‌గా పోస్ట్ వెడ్డింగ్ షూట్..
ABN , Publish Date - Feb 26 , 2026 | 09:47 PM
రావల్పిండికి చెందిన 70 ఏళ్ల హకిమ్ బాబర్ అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతిని ఇష్టపడ్డాడు. భర్తతో విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్న ఆమెను పెళ్లికి ఒప్పించాడు. తాజాగా, వీరిద్దరి పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది.
ఇంటర్‌నెట్ డెస్క్: 22 ఏళ్ల యువతి 70 ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకున్న సంఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. రావల్పిండికి చెందిన 70 ఏళ్ల హకిమ్ బాబర్ అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతిని ఇష్టపడ్డాడు. భర్తతో విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్న ఆమెను పెళ్లికి ఒప్పించాడు. తాజాగా, వీరిద్దరి పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ పోస్ట్ వెడ్డింగ్ షూట్‌లో పాల్గొ్న్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇద్దరి మధ్యా 48 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండటంతో ఈ పెళ్లి చర్చనీయాంశంగా మారింది. పెళ్లి కుమారుడు హకిమ్ బాబర్ స్థానిక మీడియాతో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘వయసు కేవలం సంఖ్య మాత్రమే. నా ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరిగింది. మనసు యవ్వనంగా ఉంటే ఆ పెళ్లి ఎప్పుడూ దృఢంగా ఉంటుంది. విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్న మహిళను పెళ్లి చేసుకోవటం ఓ మంచి నిర్ణయం అని అనుకుంటున్నాను’అని చెప్పుకొచ్చాడు. పెళ్లి కూతురు మాట్లాడుతూ.. ‘నిజమైన ప్రేమ వయసును చూడదు’ అని అంది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్ట్ వెడ్డింగ్ షూట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘నా వయసు 30 సంవత్సరాలు.. ఇంకా పెళ్లి కాలేదు. ఇలాంటివి చూసినపుడు ఏడుపు వస్తుంది’..‘ఇద్దరి మధ్యా 48 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఇద్దరూ కొంచెం ఆలోచించాల్సింది’..‘ప్రేమకు వయసుతో సంబంధం లేదు. 100 ఏళ్ల వయసులో కూడా ప్రేమ పెళ్లి చేసుకోవచ్చు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.