Share News

ఏసీ మీద 7 అడుగుల పాము.. దానికి కూడా చల్లదనం కావాలిగా..

ABN , Publish Date - Feb 22 , 2026 | 09:59 PM

ఏడు అడుగుల జెర్రిపోతు ఇంట్లోకి చొరబడింది. ఇంట్లోని ఏసీ మీద హాయిగా నిద్రపోయింది. ఏసీ మీద పామును చూసిన కుటుంబసభ్యుల గుండెలు ఝల్లుమన్నాయి. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది.

ఏసీ మీద  7 అడుగుల పాము.. దానికి కూడా చల్లదనం కావాలిగా..
Indian rat snake

ఎండాకాలం మొదలైంది. ఎండలు దంచికొడుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మనుషులకే కాదు.. మూగ జీవాలకు కూడా తిప్పలు తప్పటం లేదు. పాములు కూడా చల్లదనం కోసం ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా, ఏడు అడుగుల జెర్రిపోతు ఇంట్లోకి చొరబడింది. ఇంట్లోని ఏసీ మీద హాయిగా నిద్రపోయింది. ఏసీ మీద పామును చూసిన కుటుంబసభ్యుల గుండెలు ఝల్లుమన్నాయి. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. గురువారం విలే పార్లే ఈస్ట్‌లోని ఓ ఇంట్లోకి ఏడు అడుగుల జెర్రిపోతు చొరబడింది. ఫుల్లుగా ఆహారం తిన్న జర్రిపోతు.. చల్లదనం కోసం ఏసీ ఎక్కి నిద్రపోయింది. ఏసీ మీద పామును చూసిన కుటుంబసభ్యులు భయపడిపోయారు. వెంటనే పాములు పట్టేవారికి సమాచారం ఇచ్చారు. వారు ఇంటి దగ్గరకు వచ్చి పామును తీసుకెళ్లిపోయారు. పాము ఏసీ మీద నిద్రపోతున్న దృశ్యాల తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘జెర్రిపోతును ఇంగ్లీష్‌లో ఇండియన్ రాట్ స్నేక్ అని అంటారు. వాటికి విషం ఉండదు. ఎలుకల్ని తిని బతుకుతూ ఉంటాయి. అవి కనిపించినపుడు చంపకండి’..‘ఎండాకాలం వచ్చింది. మనుషులతో పాటు పాములకు కూడా చల్లదనం కావాలి’..‘ఏసీ మీద బాగా చల్లగా ఉన్నట్లు ఉంది. అందుకే అది హాయిగా నిద్రపోతూ ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

మీ పరిశీలనకు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 50 సెకెన్లలో కనిపెట్టండి..

ట్రంప్ ఎస్టేట్‌లో చొరబడిన అగంతకుడి కాల్చివేత

Updated Date - Feb 22 , 2026 | 10:02 PM