మారుతి సుజుకీ 800.. 1984లో ధర తెలిస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - May 21 , 2026 | 03:20 PM
మారుతి సుజుకీ 800కు సంబంధించిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారుకు సంబంధించిన షో రూమ్ బిల్ ఆ పోస్టులో ఉంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఇప్పటి వారికి మారుతి సుజుకీ 800 గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఒకప్పుడు దేశ వ్యాప్తంగా మారుతి 800 కార్లకు మంచి డిమాండ్ ఉండేది. దాదాపు 20 ఏళ్ల పాటు ఇండియన్ మార్కెట్‌లో మారుతి 800 తిరుగులేని రారాజులా కొనసాగింది. పలు కారణాల వల్ల మెల్లమెల్లగా కంపెనీ మారుతి 800 ప్రొడక్షన్ ఆపేయాల్సి వచ్చింది. 2014లో ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో ఆగిపోయింది. 1983 నుంచి 2014 వరకు మారుతి 800 మధ్య తరగతి కుటుంబాల వారికి ఓ వరంలా నిలిచింది. ధరలు మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండటం వల్ల మార్కెట్‌లోకి వచ్చిన కొన్నేళ్లకే టాప్‌లోకి వెళ్లింది.
వైరల్‌గా మారిన పోస్ట్..
మారుతి సుజుకీ 800కు సంబంధించిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారుకు సంబంధించిన షో రూమ్ బిల్ ఆ పోస్టులో ఉంది. 1984 మే నెలలో కర్ణాటకకు చెందిన శ్యామ్ అనే వ్యక్తి ఆదిత్య డీలర్ నుంచి మారుతి సుజుకీ 800 కారును కొన్నాడు. ఆ బిల్‌లో మారుతి సుజుకీ 800 కారు ఎక్స్ షో రూమ్ ధర 47,500 రూపాయలుగా ఉంది. మిగిలిన ఖర్చులతో కలిపి బిల్ 60 వేల రూపాయలు అయింది.

2014లో ధరలు ఇలా..
2014లో ప్రొడక్షన్ నిలిచిపోయే సమయానికి కారు ఎక్స్ షో రూమ్ ధర మోడల్‌ను బట్టి 2.42 లక్షల వరకు ఉండేది. బేస్ మోడల్ (800 Std Petrol) 2.06 లక్షల రూపాయలు.. ఎయిర్ కండీషనర్ మోడల్ (800 AC Petrol) 2.19 లక్షల రూపాయలు.. ఎల్పీజీ మోడల్ (800 Duo LPG) 2.24 లక్షల నుంచి 2.42 లక్షల రూపాయలు వరకు ఉండేది. ఇప్పుడు ఈ పాత 2014 మోడల్ మారుతి 800 కారును సెకండ్ హ్యాండ్‌లో కొనాలనుకుంటే.. కారు కండిషన్, కిలోమీటర్లను బట్టి మార్కెట్లో దీని ధర సుమారు 45,000 నుంచి 75,000 రూపాయల వరకు ఉంటుంది.
ఇవి కూడా చదవండి
రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..
హైబ్రిడ్ విధానంలో మహానాడును సక్సెస్ చేయాలి: సీఎం చంద్రబాబు