తెలంగాణలో SIR ప్రక్రియ ప్రారంభం.. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల అందజేత
ABN, Publish Date - Jun 25 , 2026 | 02:13 PM
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి జులై 24 వరకు ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్‌ల పరిధిలో బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్‌వో) ఇంటింటి సర్వేకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయనున్నారు. 3,38,26,448 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను ఇవ్వనున్నారు. సర్వే ప్రక్రియలో 36వేల మంది బీఎల్‌వోలు పాల్గొననున్నారు. జులై 24లోగా నింపిన ఫారాలను తిరిగి సమర్పించే అవకాశం ఉంది. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలను ఆన్‌లైన్ ద్వారా కూడా సమర్పించేందుకు ఈసీఐ అవకాశం కల్పించింది.
1/7
తెలంగాణలో SIR ప్రక్రియ ప్రారంభం
2/7
నేటి నుంచి జులై 24 వరకు కొనసాగనున్న ఎన్యూమరేషన్
3/7
వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో SIR ప్రక్రియ ఇంటింటి సర్వేలో భాగంగా గ్రీన్ పార్క్ కాలనీలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తాహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.
4/7
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ బూత్‌ల పరిధిలో బీఎల్‌వోలు ఇంటింటి సర్వేకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారు.
5/7
3,38,26,448 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను ఇవ్వనున్నారు
6/7
సర్వే ప్రక్రియలో 36వేల మంది బీఎల్‌వోలు పాల్గొననున్నారు.
7/7
జులై 24లోగా నింపిన ఫారాలను తిరిగి సమర్పించేందుకు అవకాశం ఉంది. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
Updated at - Jun 25 , 2026 | 02:19 PM