భద్రాచలంలో ఘనంగా సీతారామచంద్రస్వామి కల్యాణం

ABN, Publish Date - Mar 27 , 2026 | 01:57 PM

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలోని మండపంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.

భద్రాచలంలో ఘనంగా సీతారామచంద్రస్వామి కల్యాణం 1/5

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలోని మండపంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.

భద్రాచలంలో ఘనంగా సీతారామచంద్రస్వామి కల్యాణం 2/5

శుక్రవారం ఉదయం 10:30 గంటలకు స్వామివారి కల్యాణ ఘట్టం మొదలైంది. అభిజిత్ లగ్నంలో సీతారామయ్యల శిరస్సుపై ఆలయ అర్చకులు జీలకర్ర, బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు.

భద్రాచలంలో ఘనంగా సీతారామచంద్రస్వామి కల్యాణం 3/5

అనంతరం తలంబ్రాల వేడుక నిర్వహించారు. ఆలయ అర్చకులు ఇతర కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

భద్రాచలంలో ఘనంగా సీతారామచంద్రస్వామి కల్యాణం 4/5

శ్రీసీతారామయ్య కల్యాణ మహోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీసీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం రేవంత్ సమర్పించారు.

భద్రాచలంలో ఘనంగా సీతారామచంద్రస్వామి కల్యాణం 5/5

సీతారామయ్య కల్యాణాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి శ్రీరాముని భక్తులు భారీగా తరలివచ్చారు.

Updated at - Mar 27 , 2026 | 01:57 PM