వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు

ABN, Publish Date - Sep 25 , 2026 | 01:17 PM

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. బడా గణేశ్ నిమజ్జనాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లక్షలాది మంది భక్తుల మధ్య కోలాహలంగా బడా గణేశ్ ఊరేగింపు సాగుతోంది. డీజే వాడకుండా.. సన్నాయి మేళాల మధ్యనే ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేయనున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక, ఖైరతాబాద్ గణేశ్ వద్ద దానం నాగేందర్ సందడి చేశారు. వినాయక ఉత్సవాల సందర్భంగా భక్తులతో కలిసి 'ఆయా షేర్..' పాటకు ఉత్సాహంగా స్టెప్పులేశారు.

వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు 1/9

వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర

వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు 2/9

లక్షలాది మంది భక్తుల మధ్య కోలాహలంగా బడా గణేశ్ ఊరేగింపు

వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు 3/9

డీజే వాడకుండా.. సన్నాయి మేళాల మధ్యనే నిమజ్జనానికి వెళ్తున్న మహాగణపతి

వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు 4/9

వినాయక నిమజ్జనం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు 5/9

ఖైరతాబాద్ మహా గణపతి ముందు ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేస్తున్న యువత

వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు 6/9

సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా మహాగణపతి శోభాయాత్ర

వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు 7/9

ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ - 4, 5 దగ్గర బడా గణేశ్‌ నిమజ్జనానికి ఏర్పాట్లు

వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు 8/9

శివపార్వతులు, వినాయక వేషధారణలో అలరించిన భక్తులు

వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు 9/9

ఖైరతాబాద్ గణేశ్ వద్ద 'ఆయా షేర్..' పాటకు భక్తులతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేసిన దానం నాగేందర్

Updated at - Sep 25 , 2026 | 01:54 PM