తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. సీఎంకు ఆహ్వానం
ABN, Publish Date - Mar 19 , 2026 | 11:44 AM
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని దేవస్థానం తరఫున మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఈవో దామోదర్ రావుతోపాటు ఆలయ అర్చకులు ఆహ్వానించారు.
1/4

2/4
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. మార్చి 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
3/4
ప్రజా పాలనలో రైతు ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానించారు. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు.. నాలుగు రోజుల పాటు ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు జరుగుతాయి.
4/4
మార్చి 22న ఈ రైతు ఉత్సవాలు వేదికగా రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది.
Updated at - Mar 19 , 2026 | 11:49 AM