టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఘన విజయం.. హైదరాబాద్‌లో అంబరాన్ని అంటిన సంబరాలు
ABN, Publish Date - Mar 09 , 2026 | 07:06 AM
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఘన విజయం సాధించడంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద క్రికెట్ అభిమానులు భారీ సంబరాలు జరుపుకున్నారు. యువత జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహిస్తూ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అభిషేక్, సంజూ, ఇషాన్ హాఫ్ సెంచరీలతో రాణించగా బుమ్రా నాలుగు వికెట్లు తీసి భారత్ విజయానికి కీలక పాత్ర పోషించారు.
1/11
అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూసిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా ముగిసింది.
2/11
ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఈ పోరులో భారత్ 96 రన్స్ తేడాతో ఘనవిజయం సాధిస్తూ.. వరుసగా రెండోసారి జగజ్జేతగా నిలిచింది.
3/11
ఓవరాల్‌గా మూడు టైటిళ్లు సాధించిన ఏకైక జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. 2007లో ధోనీ, 2024లో రోహిత్ నేతృత్వంలోనూ టైటిల్స్ దక్కాయి.
4/11
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఘన విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.
5/11
ఆదివారం రాత్రి హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు క్రికెట్ అభిమానులు భారీగా చేరుకున్నారు.
6/11
పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా యువత నృత్యాలు చేశారు.
7/11
భారత్ మాతాకీ జై , ఇండియా జిందాబాద్ అంటూ పెద్ద పెట్టున్న నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.
8/11
ర్యాలీ కారణంగా కిలోమీటర్‌కు పైగా ట్రాఫిక్ జామ్ అయింది.
9/11
ట్రాఫిక్‌ని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు చర్యలు తీసుకున్నారు
10/11
క్రికెట్ అభిమానుల మధ్య చిక్కుకుపోయిన వాహనాలు.
11/11
టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్న క్రికెట్ అభిమానులు.
Updated at - Mar 09 , 2026 | 07:07 AM