సీషెల్స్ పర్యటనలో ప్రధాని మోదీ.. భారత్ - సీషెల్స్ సంబంధాలకు కొత్త ఊపు

ABN, Publish Date - Jun 28 , 2026 | 07:34 AM

సీషెల్స్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటిస్తున్నారు. సీషెల్స్‌ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మీనీతో కలిసి మోదీ శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీషెల్స్‌ అభివృద్ధిని మోదీకి.. పాట్రిక్ హెర్మీనీ వివరించారు.

 సీషెల్స్ పర్యటనలో ప్రధాని మోదీ.. భారత్ - సీషెల్స్ సంబంధాలకు కొత్త ఊపు 1/16

సీషెల్స్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటిస్తున్నారు. సీషెల్స్‌ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మీనీతో కలిసి మోదీ శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాట్రిక్ హెర్మీనీతో కలిసి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణ, సంస్కృతిక అనుబంధాలపై మోదీ చర్చలు జరిపారు.

 సీషెల్స్ పర్యటనలో ప్రధాని మోదీ.. భారత్ - సీషెల్స్ సంబంధాలకు కొత్త ఊపు 2/16

ఈ సందర్భంగా సీషెల్స్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధ్యక్షుడు హెర్మీనీ.. ప్రధాని మోదీకి వివరించారు.

 సీషెల్స్ పర్యటనలో ప్రధాని మోదీ.. భారత్ - సీషెల్స్ సంబంధాలకు కొత్త ఊపు 3/16

తన పర్యటనలో భాగంగా సీషెల్స్ జాతీయ వృక్షశాస్త్ర ఉద్యానవనాన్ని సందర్శించిన మోదీ, హెర్మీనీతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సీషెల్స్‌కు మాత్రమే ప్రత్యేకమైన ‘కోకో డి మెర్’ మొక్కను ఇద్దరూ నాటారు. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధిపై రెండు దేశాల ఉమ్మడి నిబద్ధతకు ప్రతీకగా నిలిచింది.

 సీషెల్స్ పర్యటనలో ప్రధాని మోదీ.. భారత్ - సీషెల్స్ సంబంధాలకు కొత్త ఊపు 4/16

అదే విధంగా జాతీయ వృక్షశాస్త్ర ఉద్యానవనంలోని ఆల్డబ్రా భారీ తాబేళ్ల ఆవరణను సందర్శించిన ప్రధాని, ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఎక్కువ కాలం జీవించే జాతులలో ఒకటైన ఆల్డబ్రా తాబేళ్ల గురించి తెలుసుకున్నారు.

 సీషెల్స్ పర్యటనలో ప్రధాని మోదీ.. భారత్ - సీషెల్స్ సంబంధాలకు కొత్త ఊపు 5/16

ఈ తాబేళ్లకు భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని మోదీ గుర్తు చేశారు. 2014లో రెండు ఆల్డబ్రా తాబేళ్లను కోల్‌కతాలోని అలీపూర్ జూకు బహుమతిగా ఇవ్వగా, అనంతరం హైదరాబాద్ జూకు కూడా సీషెల్స్ ప్రభుత్వం తాబేళ్లను అందించిన విషయాన్ని ప్రస్తావించారు.

 సీషెల్స్ పర్యటనలో ప్రధాని మోదీ.. భారత్ - సీషెల్స్ సంబంధాలకు కొత్త ఊపు 6/16

సీషెల్స్‌లోని భారతీయ ప్రవాసులతో కూడా ప్రధాని మోదీ సమావేశమయ్యారు.

 సీషెల్స్ పర్యటనలో ప్రధాని మోదీ.. భారత్ - సీషెల్స్ సంబంధాలకు కొత్త ఊపు 7/16

భారతదేశంలోని కచ్ ప్రాంతం నుంచి వచ్చిన ప్రతినిధి బృందానికి సీషెల్స్‌లో లభించిన ఆదరణను ప్రధాని మోదీ ప్రశంసించారు.

 సీషెల్స్ పర్యటనలో ప్రధాని మోదీ.. భారత్ - సీషెల్స్ సంబంధాలకు కొత్త ఊపు 8/16

భారతీయ సంప్రదాయాలు, భాషలు, సంస్కృతిని విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు పరిరక్షించడం అభినందనీయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

 సీషెల్స్ పర్యటనలో ప్రధాని మోదీ.. భారత్ - సీషెల్స్ సంబంధాలకు కొత్త ఊపు 9/16

రక్షణ, సముద్ర భద్రత రంగాల్లో కూడా భారత్ - సీషెల్స్ భాగస్వామ్యం మరింత బలోపేతమైంది. ఈ సందర్భంగా ‘ఎస్పోయిర్’ అనే వేగవంతమైన గస్తీ నౌకను సీషెల్స్ కోస్ట్ గార్డ్‌కు భారత్ అధికారికంగా బదిలీ చేసింది.

 సీషెల్స్ పర్యటనలో ప్రధాని మోదీ.. భారత్ - సీషెల్స్ సంబంధాలకు కొత్త ఊపు 10/16

సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మీనీ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఈ నౌకను ఆ దేశ రక్షణ దళాలకు అప్పగించారు.

 సీషెల్స్ పర్యటనలో ప్రధాని మోదీ.. భారత్ - సీషెల్స్ సంబంధాలకు కొత్త ఊపు 11/16

హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత, పర్యవేక్షణ సామర్థ్యాలను పెంచేందుకు ఈ నౌక ఉపయోగపడనుంది.

 సీషెల్స్ పర్యటనలో ప్రధాని మోదీ.. భారత్ - సీషెల్స్ సంబంధాలకు కొత్త ఊపు 12/16

సీషెల్స్ హిందూ మహాసముద్రంలో భారతదేశానికి అత్యంత కీలక సముద్ర భాగస్వామి, సన్నిహిత మిత్రదేశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

 సీషెల్స్ పర్యటనలో ప్రధాని మోదీ.. భారత్ - సీషెల్స్ సంబంధాలకు కొత్త ఊపు 13/16

ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహబంధం మరింత బలపడటంతో పాటు, భవిష్యత్తులో రక్షణ, వాణిజ్యం, పర్యావరణం, సాంస్కృతిక రంగాల్లో సహకారం మరింత విస్తరించనున్నట్లు ఇరు దేశాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

 సీషెల్స్ పర్యటనలో ప్రధాని మోదీ.. భారత్ - సీషెల్స్ సంబంధాలకు కొత్త ఊపు 14/16

తమకు చూపిన ఆప్యాయతకు ప్రవాస భారతీయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 సీషెల్స్ పర్యటనలో ప్రధాని మోదీ.. భారత్ - సీషెల్స్ సంబంధాలకు కొత్త ఊపు 15/16

సీషెల్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాన మోదీకి ఘన స్వాగతం పలికారు. జూన్‌ 29వ తేదీన జరిగే సీషెల్స్‌ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా విచ్చేయాలంటూ అందిన ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సీషెల్స్‌‌లో పర్యటిస్తున్నారు.

 సీషెల్స్ పర్యటనలో ప్రధాని మోదీ.. భారత్ - సీషెల్స్ సంబంధాలకు కొత్త ఊపు 16/16

అలాగే, భారత్‌ - సీషెల్స్‌ దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 50 సంవత్సరాలు పూర్తయింది. సీషెల్స్‌లో మోదీ మూడు రోజులు పర్యటించనున్నారు.

Updated at - Jun 28 , 2026 | 07:57 AM