సీషెల్స్‌లో స్వర్ణోత్సవ వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ
ABN, Publish Date - Jun 30 , 2026 | 06:46 AM
భారత్-సీషెల్స్ మధ్య ఉన్న చిరకాల స్నేహబంధానికి అద్దం పట్టేలా సీషెల్స్ 50వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా సీషెల్స్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ జాతీయ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
1/19
భారత్-సీషెల్స్ మధ్య ఉన్న చిరకాల స్నేహబంధానికి అద్దం పట్టేలా సీషెల్స్ 50వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
2/19
మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా సీషెల్స్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ జాతీయ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
3/19
ఈ సందర్భంగా సోమవారం భారత ఆర్మీ, నౌకాదళ దళాలు కవాతు నిర్వహించాయి.
4/19
వారికి గౌరవ సూచకంగా ప్రధాని మోదీ లేచి నిలబడటం కార్యక్రమానికి విశేషంగా నిలిచింది.
5/19
రాజధాని విక్టోరియాలో నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ పరేడ్‌లో భారత ఆర్మీకి చెందిన అస్సాం రెజిమెంట్ సైనికులు, భారత నౌకాదళానికి చెందిన సిబ్బంది కవాతు నిర్వహించి ఆకట్టుకున్నారు.
6/19
ముఖ్యంగా అస్సాం రెజిమెంట్ జవాన్లు తమ ప్రసిద్ధ రెజిమెంటల్ గీతం ‘బడ్లు రామ్ కా బదన్’ ఆలపిస్తూ మార్చ్ చేయడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
7/19
ఈ వేడుకల్లో భారత నౌకాదళానికి చెందిన అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్ తార్కష్, స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్‌ఎస్ ఇక్షాక్ సర్వే నౌకలూ పాల్గొన్నాయి.
8/19
భారత్-సీషెల్స్ ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలపడుతోందని ప్రధాని మోదీ అన్నారు.
9/19
ఈ సందర్భంగా భారత నౌకాదళం స్పందించింది. సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవాల్లో ఐఎన్‌ఎస్ తార్కష్, ఐఎన్‌ఎస్ ఇక్షాక్ నౌకలు, భారత నౌకాదళ బ్యాండ్, మార్చింగ్ కంటింజెంట్ పాల్గొన్నాయని తెలిపింది. ఇది భారత్-సీషెల్స్ సముద్ర సహకారానికి ప్రతీకని పేర్కొంది.
10/19
మరోవైపు, ఈ వేడుకల అనంతరం ప్రధాని మోదీ కూడా ఎక్స్‌లో స్పందించారు. ఈ సందర్భంగా సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ ఆతిథ్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
11/19
'అస్సాం రెజిమెంట్, భారత నౌకాదళ దళాలు సీషెల్స్ జాతీయ దినోత్సవ పరేడ్‌లో పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న చిరస్థాయి స్నేహానికి మరో నిదర్శనం' అని ప్రధాని పేర్కొన్నారు.
12/19
విక్టోరియాలోని కోట్ శాంతి పార్కులో గల మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. బాపూ తరతరాలకు అందించిన ఆదర్శాలు, శాంతి, న్యాయం కోసం చేసే అన్వేషణలో ప్రతి ఒక్కరినీ పునరుజ్జీవింపజేస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు ఒక మెరుగైన ప్రపంచం కోసం మన సామూహిక ప్రయత్నానికి స్ఫూర్తినిస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు.
13/19
కాగా, ప్రధాని మోదీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారం 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్' లభించింది.
14/19
సీషెల్స్ దేశ ప్రధాని ప్యాట్రిక్ హెర్మినీ.. భారత ప్రధానికి ఆదివారం నాడు అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు.
15/19
సీషెల్స్ అభివృద్ధి ప్రయాణంలో ఒక విశ్వసనీయ మిత్రుడిగా, భాగస్వామిగా దాని పక్కన నిలవటం భారతదేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఉమ్మడి విలువలు, సన్నిహిత ప్రజల సంబంధాలతో మన భాగస్వామ్యం మరింత బలపడుతోందని వివరించారు. రాబోయే కాలంలో మన స్నేహం మరింతగా వృద్ధి చెందుతుందని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు.
16/19
సీషెల్స్‌లోని విక్టోరియాలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయమైన అరుల్మిగు నవశక్తి వినాయగర్‌లో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు.
17/19
ఈ ఆలయాన్ని నిర్మించిన హిందూ కోవిల్ సంఘాన్ని ఈ సందర్భంగా మోదీ అభినందించారు.
18/19
సీషెల్స్‌లోని భారతీయ సమాజ సభ్యులను కలవడం తనకు ఒక అద్భుతమైన అనుభవమని ప్రధాని మోదీ అన్నారు. వారు సీషెల్స్ పురోగతికి సమర్థవంతమైన సహాకారాన్ని అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ, లెన్‌తో వారికున్న అనుబంధం ఇప్పటికీ చాలా శక్తివంతమైనదని తెలిపారు.
19/19
అరుల్మిగు నవశక్తి వినాయగర్ ఆలయ నిర్మాణంలో, సీషెల్స్‌లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలోని వివిధ అంశాలను ప్రోత్సహించి, వ్యాప్తి చేయడంలో సీషెల్స్ హిందూ కోవిల్ సంఘ్ చేసిన కృషిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.
Updated at - Jun 30 , 2026 | 07:16 AM