వైభవంగా జడల రామలింగేశ్వర స్వామి నగరోత్సవం
ABN, Publish Date - Jan 24 , 2026 | 11:21 AM
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నగరోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి నిర్వహించిన స్వామి, అమ్మవార్ల నగరోత్సవం పురవీధుల్లో కన్నుపండువగా సాగింది. వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలకరించిన వాహనంలో స్వామి, అమ్మవార్లను పురవీధుల్లో ఊరేగించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డైరీ కార్పోరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిలు నగరోత్సవాన్ని ప్రారంభించారు. నగర ఉత్సవంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు, కోలాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.
1/8
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నగరోత్సవం వైభంగా జరిగింది.
2/8
శుక్రవారం రాత్రి నగరోత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లను పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు.
3/8
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిలు నగరోత్సవాన్ని ప్రారంభించారు.
4/8
వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో స్వామి, అమ్మవార్లను ఊరేగించారు.
5/8
మహిళల నృత్య ప్రదర్శనలు, కోలాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.
6/8
నగరోత్సవంలో చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
7/8
జడల రామలింగేశ్వర స్వామి వారి నగరోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
8/8
నల్గొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, నార్కట్‌పల్లి మండల అధ్యక్షులు బత్తుల ఉషయ్య, చెర్వుగట్టు సర్పంచ్ నేతగాని కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Updated at - Jan 24 , 2026 | 12:21 PM