ఈ విషయం గుర్తుంచుకోండి: మంత్రి లోకేష్

ABN, Publish Date - Jan 30 , 2026 | 07:44 PM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు.. ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంత్రిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు..

ఈ విషయం గుర్తుంచుకోండి: మంత్రి లోకేష్ 1/8

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు.. ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంత్రిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ విషయం గుర్తుంచుకోండి: మంత్రి లోకేష్ 2/8

స్థానిక టీడీపీ కీలక నేతలు, కార్యకర్తలను ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మంత్రి నారా లోకేష్ ముందుకు సాగారు.

ఈ విషయం గుర్తుంచుకోండి: మంత్రి లోకేష్ 3/8

ఈ క్రమంలోనే సూరంపాలెం వద్ద మంత్రి నారా లోకేష్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు అభివాదం చేశారు.

ఈ విషయం గుర్తుంచుకోండి: మంత్రి లోకేష్ 4/8

జేఎన్‌టీయూలో విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా సంభాషించిన లోకేశ్.. వారి సందేహాలను నివృత్తి చేశారు.

ఈ విషయం గుర్తుంచుకోండి: మంత్రి లోకేష్ 5/8

ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్స్‌ను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. త్వరలో రాష్ట్రానికి 760 కంపెనీలు తీసుకొస్తున్నామని, అగ్రికల్చర్ ఎంత ముఖ్యమో.. పరిశ్రమలు కూడా అంతే ముఖ్యమని మంత్రి అన్నారు.

ఈ విషయం గుర్తుంచుకోండి: మంత్రి లోకేష్ 6/8

త్వరలో 4 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని.. అందులో 80 శాతం స్థానికులకే ఇస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.

ఈ విషయం గుర్తుంచుకోండి: మంత్రి లోకేష్ 7/8

ప్రతి నెలా విద్యార్థులతో మాట్లాడతానని.. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెలా నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

ఈ విషయం గుర్తుంచుకోండి: మంత్రి లోకేష్ 8/8

కష్టకాలంలో తోడుగా వచ్చిన వారిని ఎప్పుడూ మరచిపోకూడదని.. ఈ విషయం గుర్తుంచుకోవాలని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ సూచించారు.

Updated at - Jan 30 , 2026 | 09:07 PM