ప్రకృతి మధ్య పక్షుల సందడి
ABN, Publish Date - Jan 12 , 2026 | 02:29 PM
సందర్శకులు, పర్యాటకులతో పులికాట్ సరస్సు పులకించింది. సూళ్లూరుపేట కేంద్రంగా నిర్వహిస్తున్న పక్షుల పండుగ రెండవ రోజు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.
1/5
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కేంద్రంగా జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్-2026 రెండో రోజు సందర్శకులు పోటెత్తారు.
2/5
ప్రకృతి మధ్య ఈ పక్షుల నివాసం చూడముచ్చటగా ఉంది. భీములవారిపాళెం పడవలరేవుకు, నేలపట్టు పక్షుల కేంద్రానికి, అటకానితిప్ప వద్ద పులికాట్ సరస్సును తిలకించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
3/5
పక్షులు బాగున్నాయి కదూ అంటూ విద్యార్థులు సెల్ఫీలు దిగారు. ప్రకృతి అందాల మధ్య విద్యార్థులు ఉత్సాహంగా సెల్ఫీ తీసుకుంటున్నారు.
4/5
భీములవారిపాళెం పడవలరేవులో బోటు షికారుకు జనం పొటీపడ్డారు. అలల ఉధ్రుతి ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం తర్వాత ఇరకం దీవికి బోట్లు ఆపేశారు.
5/5
సూళ్లూరుపేట జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్ పోటీలలో విజేతలకు శాప్ చైర్మన్ రవినాయుడు, కలెక్టర్ వెంకటేశ్వర్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ బహుమతులను ప్రదానం చేశారు.
Updated at - Jan 12 , 2026 | 02:31 PM