వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ డ్రిస్టిక్ 601ఏ అధ్యక్షుడిగా వివేకానంద బాలుసా ఎన్నిక
ABN , Publish Date - Nov 16 , 2026 | 08:47 PM
వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ డ్రిస్టిక్ 601ఏకు ఆదివారం ఎన్నికలు నిర్వహించగా రానున్న సంవత్సరం 2027కు దుబాయిలోని ప్రముఖ వ్యాపారవేత్త వివేకానంద బాలుసా గవర్నర్‌గా ఎన్నికయ్యారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: కులమూల పురుషుడు కుబేరుడయినా వాణిజ్య, వర్తక రంగాలకే పరిమితం కాకుండా వైశ్యులు విదేశాలలో కూడా తమ సత్తాను చాటుతున్నారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి భక్తులంటే అహింస, త్యాగం, ఆత్మగౌరవం, నిస్వార్థ సేవా స్ఫూర్తికి ప్రతీక. దాన్ని ఎల్లలు దాటినా కూడా కార్యాచరణలో చూపిస్తోంది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్.
ప్రపంచవ్యాప్తంగా భారతీయుల సేవలో ఒక భాగమైన వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ డ్రిస్టిక్ 601ఏ గల్ఫ్ ప్రాంతంలో ప్రత్యేకించి వైశ్యులు ఎక్కువ సంఖ్యలో నివసించే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని సేవా సంఘాలలో చురుకైన పాత్రపోషిస్తుండగా దీనికి తెలుగు సమాజంలో గౌరవప్రదమైన గుర్తింపు ఉంది. ఇందులో భాగస్వామ్యం కావడానికి వైశ్యులలో ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ డ్రిస్టిక్ 601ఏకు ఆదివారం ఎన్నికలు నిర్వహించగా రానున్న సంవత్సరం 2027కు దుబాయిలోని ప్రముఖ వ్యాపారవేత్త వివేకానంద బాలుసా గవర్నర్‌గా ఎన్నికయ్యారు.
వాసవీ క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు సిద్ధ సూర్య ప్రకాశ్ అధ్యక్షతన ప్రస్తుత మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ సమక్షంలో ప్రస్తుత డ్రిస్ట్రిక్ గవర్నర్ నోకల మురళీకృష్ణ పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి.
దుబాయిలోని తెలుగు ప్రవాసీ ప్రముఖులలో ఒకరైన వివేకానంద, సౌమ్యుడిగా పేరొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాసవీ క్లబ్ ఆశయాలకు అనుగుణంగా అందరి భాగస్వామ్యంతో ముందుకెళ్తానని పేర్కొన్నారు.
వివేకానంద ఎన్నికపై దుబాయి, ఇతర ఎమిరేట్లలో కూడా ప్రవాసీయులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
బహ్రెయిన్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం