Share News

రియాధ్‌లో ఆదివాసీ దినోత్సవం

ABN , Publish Date - Nov 15 , 2026 | 08:34 PM

రియాధ్ నగరంలోని భారతీయ ఎంబసీలో శనివారం సాయంత్రం గిరిజన వీరుడు ముండా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన జన్‌జాతీయ గౌరవ దివస్ కార్యక్రమం వైభవంగా జరిగింది.

రియాధ్‌లో ఆదివాసీ దినోత్సవం
Jan Jatiya Gaurav Divas

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: భారత స్వాతంత్ర్య పోరాటం అనేక మంది వీరయోధులను సృష్టించగా అందులో అనేక మంది మహానుభావుల గురించి భవిష్యత్ తరాలకు తెలియకుండా పోయిందని భారతీయ రాయబారి విపుల్ అన్నారు. అందులో ఆదివాసీ ఆరాధ్యదైవమైన బిర్సా ముండా ఒకరని ఆయన అన్నారు.

రియాధ్ నగరంలోని భారతీయ ఎంబసీలో శనివారం సాయంత్రం గిరిజన వీరుడు ముండా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన జన్‌జాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన త్యాగం, ధైర్యానికి ముండా ప్రతీక అని అన్నారు. ఆదివాసుల సంక్షేమం ద్వారా జాతీ గౌరవానికి ఆయన కృషి చేసారంటూ నివాళులు అర్పించారు.

Jan Jatiya Gaurav Divas


ఈ కార్యక్రమాన్ని భారతీయ ఎంబసీ, ప్రవాసీ సంఘం గ్లోబల్ ఇండియన్ ఆర్గనైజషన్ (జియో) సంయుక్తంగా నిర్వహించగా తెలుగు ప్రవాసీ సంఘం సాటా సహాయసహకారాలను అందించింది.

పొట్టకూటి కోసం దేశంలో వివిధ ప్రాంతాలలో సంచరించే ఆదివాసులు ఇప్పుడు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు కూడా వస్తున్నారని సాటా వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేశన్ అన్నారు. బతుకుదెరువు కోసం జార్ఘండ్, ఒడిశాల నుంచి ఆదివాసులు తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు వస్తుండగా ఈ రెండు రాష్ట్రాల నుంచి గల్ఫ్ వలసలు ఎక్కువగా ఉన్న విషయాన్ని మల్లేషన్ గుర్తు చేసారు. భారతీయ సంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్ప ప్రతి కార్యక్రమంలో సాటా చురుగ్గా పాల్గొంటుదని ఆయన పేర్కొన్నారు.

NRI3.jpg


ఈ సందర్భంగా తెలంగాణ ఆడవిబిడ్డల ఆరాధ్యుడు కొమరం భీంపై ప్రవాసీయుడు రేలంగి రాం తెలుగులో పాడిన పాట అందర్నీ ఆకట్టుకుంది. ఒడిశా, ఝార్ఖండ్ ఇతర రాష్ట్రాలకు చెందిన ఆదివాసుల జీవన విధానాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా జియో సభ్యులు ప్రదర్శించారు.

కార్యక్రమంలో జియో ప్రతినిధులు విశాల్, రమేశ్, హర్షల, షగుఫ్తా, సాటా ప్రతినిధులు ముజ్జమ్మీలొద్దీన్, నూరోద్దీన్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

NRI2.jpg


ఈ వార్తలనూ చదవండి:

ఖతర్‌లో కమ్మని వేడుకగా కాకతీయ వనభోజనాలు

తెలుగు దేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు

Updated Date - Nov 15 , 2026 | 08:36 PM