Share News

ఖతర్‌లో కమ్మని వేడుకగా కాకతీయ వనభోజనాలు

ABN , Publish Date - Nov 14 , 2026 | 08:02 AM

ప్రవాసీ సంఘం కాకతీయ కుటుంబం ఆధ్వర్యంలో శుక్రవారం ఖతర్‌లో జరిగిన కార్తీక వనభోజనాల కార్యక్రమంలో ఆధ్యాత్మికత, ఆత్మీయత వెల్లివిరిసింది.

ఖతర్‌లో కమ్మని వేడుకగా కాకతీయ వనభోజనాలు
Karthika Vanabhojanam Qatar

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఖతర్‌లోని తెలుగు ప్రవాసీ సామాజికవర్గాల సంఘాలలో చురుకైన కాకతీయ కుటుంబం శుక్రవారం నిర్వహించిన కార్తీక వనభోజనాలతో ఎడారినాట ఆధ్యాత్మికత, ఆత్మీయత వెల్లివిరిసింది.

ఖతర్‌లో తమకంటూ ఒక విశిష్ఠత కల్గిన కమ్మ సామాజికవర్గ ప్రవాసీయులు దోహా ప్రకృతి ఒడిలో నిర్వహించిన కార్తీక వనభోజనాలు కోస్తాంధ్రను తలపించాయి. కార్యక్రమం కేవలం ఒక విందుగా మాత్రమే కాకుండా ఆత్మీయతను, ఐకమత్యాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించింది.


ఆకాశంలో సగం ... వనంలో మొత్తం తామంటూ ఆడపడుచులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తమ సత్తాను చాటారు. దీన్ని ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా మాత్రమే కాకుండా, ఆత్మీయ కలయికగా నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులు అందర్నీ అలరించారు. పెద్దలు, చిన్నలు అనే వ్యత్యాసం లేకుండా అన్ని వయస్సుల వారి అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల సంప్రదాయక కార్యక్రమాలతో అందరూ దినమంతా ఉల్లాసంగా గడిపారు. వివిధ రకాల ఆటలపోటీలను కూడా ఉత్సాహభరితంగా నిర్వహించారు.

మొత్తం 25 రకాల సంప్రదాయక వంటకాలను అతిథులకు వడ్డించడంతో పాటు వివిధ రకాల తినుబండారాలను కూడా అందించారు.


ఈ వార్తలనూ చదవండి:

తెలుగు దేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు

ఖతర్‌లో తెలుగు డయాస్పోరా ఫోరం ఆవిర్భావం

Updated Date - Nov 14 , 2026 | 08:11 AM