Share News

తెలుగు దేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు

ABN , Publish Date - Nov 11 , 2026 | 07:27 PM

సిడ్నీ నగరంలో మహిళలు, బాలికల కోసం తెలుగు దేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి.

తెలుగు దేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు
Telugu Desam Australia

సిడ్నీ నగరంలో మహిళలు, బాలికల కోసం తెలుగు దేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకూ మూడు యోగా శిక్షణ తరగతులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ తరగతుల్లో పాల్గొంటున్న మహిళలు యోగా సాధన తమ దైనందిన జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని, మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం, పని, వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత (Work-Life Balance) సాధించడానికి దోహదపడుతోందని తెలిపారు.


NRI2.jpg

ఈ యోగా శిక్షణ తరగతులను ఈషా ఫౌండేషన్‌కు చెందిన శిక్షకులు నిర్వహిస్తున్నారు. మొత్తం కార్యక్రమంలో భాగంగా చివరి సెషన్ నవంబర్ 21వ తేదీ శనివారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతి సెషన్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్న మహిళలు, బాలికలకు, అలాగే యోగా శిక్షణ అందిస్తున్న ఈషా ఫౌండేషన్‌కు తెలుగు దేశం ఆస్ట్రేలియా కార్యవర్గం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది. మహిళలు, బాలికల ఆరోగ్యం, శ్రేయస్సు, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ తెలుగు దేశం ఆస్ట్రేలియా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఖతర్‌లో తెలుగు డయాస్పోరా ఫోరం ఆవిర్భావం

లండన్ బరో ఆఫ్ సటన్ కౌన్సిలర్‌గా ఆలపాటి చంద్ర

Updated Date - Nov 11 , 2026 | 07:28 PM