Share News

ఒమాన్‌లో శ్రీ రాజ రాజేశ్వరస్వామి కల్యాణోత్సవం

ABN , Publish Date - Mar 22 , 2026 | 09:46 PM

ఒమాన్ రాజధాని మస్కట్‌లోని శ్రీ కృష్ణ మందిర ప్రాంగణంలో శుక్రవారం ఒమాన్ తెలంగాణ సమితి (ఒ.టి.యస్) ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.

ఒమాన్‌లో శ్రీ రాజ రాజేశ్వరస్వామి కల్యాణోత్సవం
Vemulawada Rajarajeshwara Swamy Kalyanam Oman

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగు ప్రజలు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా భక్తి, ఆధ్యాత్మికత విషయంలో మిగిలిన వారి కంటే ముందుంటారు. ఏడు కొండలైనా ఎంబలవాడ రాజన్న అయినా ఎడారుల్లోనైనా భక్తుల నీరాజనాలను అందుకుంటారు.

యుద్ధ ఉద్రిక్తత పరిస్థితులలో కూడా గల్ఫ్‌లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఒమాన్ రాజధాని మస్కట్‌లోని శ్రీ కృష్ణ మందిర ప్రాంగణంలో శుక్రవారం ఒమాన్ తెలంగాణ సమితి (ఒ.టి.యస్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం తెల్లవారుజామున సుప్రభాతంతో మొదలై సాయంత్రం మహాప్రసాదంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో భారతీయ రాయబారి జి.వి.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


ఒమాన్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాలన్నీ కూడా సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలని శివపార్వతులను ప్రార్థించామని ముఖ్య నిర్వాహకులలో ఒకరైన నూనె లక్ష్మణ్ పేర్కొన్నారు.

Gulf 3.jpgGulf 2.jpg


ఇవి కూడా చదవండి..

సింగపూర్‌లో ఉగాది సంబరాలు

అమెరికా వ్యాప్తంగా మోసాలు! భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ గాలింపు

Updated Date - Mar 22 , 2026 | 09:48 PM