సింగపూర్‌లో ఉగాది సంబరాలు
ABN , Publish Date - Mar 21 , 2026 | 02:50 PM
సింగపూర్‌లోని చాంగీ రామర్ దేవాలయం, సెంగ్‌కాంగ్ మురుగన్ దేవాలయం, యిషున్ మహా మారియమ్మన్ దేవాలయం శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయాల్లో మార్చి 19, 20, 2026 తేదీలలో ఉగాది పండుగను తెలుగు వారు ఘనంగా నిర్వహించుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సింగపూర్‌లోని తెలుగువారు ఈ ఏడాది ఉగాది పండుగను సంప్రదాయానికి అనుగుణంగా వైభవంగా జరుపుకున్నారు. స్థానిక చాంగీ రామర్ దేవాలయం, సెంగ్‌కాంగ్ మురుగన్ దేవాలయం, యిషున్ మహా మారియమ్మన్ దేవాలయం శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయాల్లో మార్చి 19, 20, 2026 తేదీలలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
టీమ్ శివ ప్రసాద్ సభ్యులు ప్రత్యేకంగా మొదటిసారి నాలుగు దేవాలయాల్లో ఉగాది వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి, ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో భక్తి, ఆనందం, ఐక్యత, సాంప్రదాయాల పట్ల గౌరవం మరోసారి ప్రతిఫలించింది. సమాజంలోని సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పండుగను జరుపుకోవడం అందరి హృదయాలను ఆనందంతో నింపింది. ఈ ఉత్సవాల ద్వారా సాంప్రదాయం, సంస్కృతి, భక్తి, ఐక్యతా భావనలు మరింత బలపడగా, ప్రతి కుటుంబానికి సంతోషం, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్ష వ్యక్తమైంది. ఈ ఆశయంతో, సింగపూర్‌లో టీమ్ శివ ప్రసాద్ సభ్యులు 2026 ఉగాది వేడుకలను విజయవంతంగా ముగించారు.











ఇవి కూడా చదవండి..
అమెరికా వ్యాప్తంగా మోసాలు! భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ గాలింపు
అత్యంత ఘనంగా తానా మిడ్-అట్లాంటిక్ చదరంగ టోర్నమెంట్ 2026