Share News

అత్యంత ఘనంగా తానా మిడ్-అట్లాంటిక్ చదరంగ టోర్నమెంట్ 2026

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:00 PM

మార్చి 15వ తేదీన డెలావేర్‌లోని మిడిల్‌టౌన్ ‘బెస్ట్ బ్రెయిన్స్’ వేదికగా మిడ్-అట్లాంటిక్ చెస్ టోర్నమెంట్ 2026ను తానా అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ టోర్నమెంట్ ప్రారంభం నుంచే మంచి ప్రచారం చేయడం వల్ల ఎంతోమంది యువ చెస్ ఆటగాళ్లు పాల్గొని తమ సత్తా చాటారు.

అత్యంత ఘనంగా తానా మిడ్-అట్లాంటిక్ చదరంగ టోర్నమెంట్ 2026
TANA Chess Tournament 2026

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం కమ్యూనిటీకి దగ్గరయ్యేందుకు వీలుగా ఎన్నో కార్యక్రమాలు ప్రతి నెలా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, సెమినార్లు.. ఇలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మార్చి 15వ తేదీన డెలావేర్‌లోని మిడిల్‌టౌన్ ‘బెస్ట్ బ్రెయిన్స్’ వేదికగా మిడ్-అట్లాంటిక్ చెస్ టోర్నమెంట్ 2026ను అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ టోర్నమెంట్ ప్రారంభం నుంచే మంచి ప్రచారం చేయడం వల్ల ఎంతోమంది యువ చెస్ ఆటగాళ్లు పాల్గొని తమ సత్తా చాటారు. ఎత్తులు, పైఎత్తులతో అందరినీ ఆకర్షించారు.
TANA-4.jpg


ఈ పోటీల కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేసిన తానా అందరి ప్రశంసలను అందుకుంది. తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగుల మార్గదర్శకత్వంలో ఈ పోటీలు జరిగాయి. యువ చెస్ క్రీడాకారులు కూడా ఈ టోర్నమెంట్‌ను తమ ప్రతిభను చాటుకునేందుకు చక్కగా ఉపయోగించుకున్నారు. టోర్నమెంట్ డైరెక్టర్ జోషువా ఆండర్సన్, తానా చెస్ ఈవెంట్ కోఆర్డినేటర్ నాయుడమ్మ యలవర్తి ఈ పోటీలను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
TANA-2.jpg


తానా మిడ్-అట్లాంటిక్ బృంద సభ్యులు సతీష్ తుమ్మల, ఫణి కంతేటి, సత్యనారాయణ పొన్నగంటి, సునీల్ కోగంటి, రంజిత్ మామిడి, నాయుడమ్మ యలవర్తి, నవీన్ ఘంటా, హిమతేజ మికిలినేని ఈ టోర్నమెంట్ విజయవంతం అవడానికి ఎంతో శ్రమించారు. అలాగే, యువ వాలంటీర్లు తపస్వి ఘంటా, కృతి రెడ్డి నిమ్మ, లాలిత్య రెడ్డి యెరువ, ప్రణవ్ కంతేటి, ఆర్నవ్ కంతేటి, దివిత్ శర్మల సేవలను తానా గుర్తించింది. ఈ టోర్నమెంట్ నిర్వహణలో కీలకపాత్ర పోషించిన డైరెక్టర్ జోషువా ఆండర్సన్‌ను తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఘనంగా సన్మానించారు.
TANA-3.jpg


అనంతరం క్రీడాకారులకు, వాలంటీర్లకు సర్టిఫికేట్లు అందజేశారు. యువతలో మేధోపరమైన నైపుణ్యాలను పెంపొందించడానికి తానా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పోటీలకు గ్రాండ్ స్పాన్సర్లుగా గ్లెన్‌మూర్ ఫ్యామిలీ డెంటిస్ట్రీ, రాజా గాంధే.. పోటీలకు మౌలిక సదుపాయాలను కల్పించిన కిషోర్ కుకలకుంట్ల, శ్రీదేవి నెక్కలపులకు తానా ధన్యవాదాలు తెలియజేసింది. ఆటగాళ్లకు, వాలంటీర్లకు రుచికరమైన భోజనం, టీ, కాఫీని ‘నమస్తే ఇండియా’ (గ్రోసరీ స్టోర్ అండ్ రెస్టారెంట్) వారు సమకూర్చారు.
TANA-5.jpg


విజేతలు

నాన్ రేటెడ్ కె. 8 విభాగంలో...

ధన్విన్ అమిరిశెట్టి, అనయ్ వర్మ, సరాన్ష్ సాగర్

నాన్-రేటెడ్ 9-12 (పెద్దలతో కలిపి)

చాణక్య వర్ధన్ కేతిరెడ్డి, లాల్ ఎం, ధ్రుపద్ వెలగపూడి

రేటెడ్ 500 లోపు

హర్షిత్ కన్నన్, రేయాన్ష్ కక్కెర్ల, ప్రతీక్ పరిదా

రేటెడ్ 900 లోపు

సాయి వెంకట్ శాన్విత్ నందన్ అలహరి, లూకాస్ లియు, పూర్వాన్స్ నాయక్

రేటెడ్ ఓపెన్

సాయి రేయాన్ష్ నగిశెట్టి, లోహిత్ శ్రీ కృష్ణ ఎంగళ్ళ, సిధ్ తివారీ
TANA-6.jpg


ఇవి కూడా చదవండి

ఒంటరిగా ఫీలవుతున్నారా? కారణం మీ అలవాట్లే కావచ్చు!

జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు

Updated Date - Mar 18 , 2026 | 04:23 PM