సిడ్నీలో ఎన్టీఆర్ విమెన్స్ త్రోబాల్ టోర్నమెంట్
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:22 PM
తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో అక్టోబర్ 4న సిడ్నీలో ఎన్టీఆర్ విమెన్స్ త్రోబాల్ టోర్నమెంట్-2026 ఘనంగా జరిగింది.
తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో అక్టోబర్ 4న సిడ్నీలో ఎన్టీఆర్ విమెన్స్ త్రోబాల్ టోర్నమెంట్-2026 ఘనంగా జరిగింది. తెలుగు కమ్యూనిటీ మహిళల కోసం ఈ టోర్నీని ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్‌లో 8 మహిళా జట్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాయి. అందరి సహకారం, చురుకైన భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ టోర్నీలో విజేతలుగా గాండీవం, రన్నరప్‌గా సౌత్‌వెస్ట్ మిసైల్స్ టీమ్స్ నిలిచాయి. తెలుగుదేశం ఆస్ట్రేలియా తెలుగు కమ్యూనిటీ కోసం, ముఖ్యంగా తమ సాధికారత, ఆరోగ్యం కోసం చేస్తున్న కార్యక్రమాలను మహిళలు అభినందించారు.



ఈ వార్తలనూ చదవండి:
దుబాయిలో బతుకమ్మ చందాల వసూళ్ల పర్వం
మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు తానా - పాఠశాల వేదికగా ఘన నివాళి