Share News

మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు తానా - పాఠశాల వేదికగా ఘన నివాళి

ABN , Publish Date - Oct 04 , 2026 | 02:07 PM

అమెరికా రాజధాని పరిధిలో జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా జరిపారు.

మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు తానా - పాఠశాల వేదికగా ఘన నివాళి
Mahatma Gandhi Jayanthi

అమెరికా రాజధాని పరిధిలో జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. వారి చిత్రపటాలకు ప్రవాస భారతీయులు, పెద్దలు పూలతో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యక్షుడు భానుప్రకాష్ మాగులూరి మాట్లాడుతూ, స్వాతంత్య్ర పోరాట చరిత్రలో మహాత్ములు భరతమాత దాస్య శృంఖలాలను తెంచి కోట్లాది మందికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం తీసుకొచ్చారని అన్నారు. జన జాగృతికి, జాతి చైతన్యానికి జీవితాన్ని అంకితం చేసి అమరులైన మహాత్ములకు ఘన నివాళి అర్పించారు. ఏ దేశమేగినా యందు కాలిడినా, ప్రప్రథమంగా భారతీయులు తమ మూలాలను గుర్తు చేసుకుంటూ, మాతృభాషను కాపాడుకోవటం అందరి విధి అని తెలిపారు.


మహాత్ముల గొప్పతనం వారి సాదాసీదా జీవనశైలిలో, దేశభక్తిలో, ఉన్నత విలువల్లో ఉంది. దశాబ్దాల పాటు సత్యం, అహింస సిద్ధాంతాలను సదా ఆచరిస్తూ సామాజిక భాద్యత, నిరాడంబరతను నిరంతరం పాటిస్తూ జాతిని ఐక్యతతో ఏకతాటిపై నిలిపారు. శాంతియుత పోరాటం చేస్తూ, ప్రపంచానికే అహింస సిద్దాంతాన్ని ప్రబోధించిన శాశ్వత ఘనత మహాత్మా గాంధీజీది అని పెద్దలందరూ గుర్తు చేసుకున్నారు.


భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి తరతరాల నాయకులకు ఆదర్శంగా నిలిచారు. నీతి, నిజాయితీ, దేశ భక్తి, పునాదులుగా తన జీవిత చరమాంకం వరకూ ముందుకుసాగారు. నిరాడంబరతకు నిలువెత్తు అద్దంలా నిలిచి చరిత్రలో నిలిచిపోయారని గుర్తు చేసుకుంటూ ప్రవాసులు నివాళి అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎండూరు సీతారామారావు, కొత్తూరు కామేశ్వరరావు, చిట్టెల సుబ్బారావు, రామ్మోహన్ రెడ్డి, చింతా రాంబాబు, మైనేని రాధా కృష్ణ, మేకల రామిరెడ్డి, జంపాల కృష్ణ మోహన్, చెరుకూరి ఇందుశేఖర్, కట్టా అంకమ్మ, జిరబోయిన రాజేందర్, అన్నం పూర్ణచంద్రరావు, అల్లం లింగం, సత్యనారాయణ, శంకర్ రెడ్డి, సురేష్, రమేష్, బలరాం, భాస్కరరావు, కృష్ణమూర్తి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఆరోగ్యవంతమైన తెలుగు సమాజం దిశగా ఖతర్‌లో ఆరోగ్య శిబిరం

అమెరికాలో హిందూ ఆచారాలపై పిల్లలకు 'రిచువల్స్ అండ్ రీజన్' సదస్సులు

Updated Date - Oct 04 , 2026 | 02:20 PM