Share News

దుబాయిలో బతుకమ్మ చందాల వసూళ్ల పర్వం

ABN , Publish Date - Oct 05 , 2026 | 02:28 PM

దుబాయిలో బతుకమ్మ పండుగ నిర్వహణలో చందాల వసూళ్ల పర్వం నడుస్తోంది. ఆత్మీయ పండుగను కొందరు పక్కా వ్యాపారంగా మారుస్తున్నారు.

దుబాయిలో బతుకమ్మ చందాల వసూళ్ల పర్వం
Bathukamma Donation allegations

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: బతుకమ్మను పేర్చే వారికి పూల పరిచయముండాలి.. రంగుల రహస్యం తెలిసుండాలి, అద్దకం, కలంకారీ పనితనం కావాలి.. ఈ విద్యలు అందరికీ రావు. అదే విధంగా విదేశాలలో అందునా తెలంగాణ ప్రవాసీయులు భారీ సంఖ్యలో దుబాయిలో బతుకమ్మను నిర్వహించడం అనేది కొందరు మాత్రమే బతకనెర్చిన కళ. బతుకమ్మను నిర్వహించే వారికి దందాల పరిచయం ఉండాలి. చందాల రహస్యం తెలిసుండాలి.


వర్షాకాలంలో నల్లబొంత పురుగులు వచ్చినట్లుగా బతుకమ్మ సీజన్ వచ్చిందంటే చాలు నిద్రావస్థలో ఉన్న కొందరు నాయకులమంటూ లేచి నిలబడి జోలె పడుతున్నారు. బతుకమ్మంటూ బజారున పడుతున్నారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన బతుకమ్మ పేరిట తమ అస్తిత్వం చాటుకునే మూకలు కొన్ని ఉన్నాయి. పూల కింద ముళ్లు గుచ్చె గుంపులు ఉన్నాయి. స్పాన్సర్లు, టిక్కెట్లు అనే తిమింగాలు తిరుగుతున్నాయి. ఆత్మీయ పండుగను కొందరు పక్కా వ్యాపారంగా మారుస్తున్నారు. అనేక మంది తెలంగాణ ప్రముఖులను కలుస్తూ వారికి బొట్టు పెట్టి ఆహ్వానిస్తూ మరీ జోలె పడుతున్నారు. గతంతో పోలిస్తే ఈ సారి ఇది ఎక్కువ అయిందని తెలుస్తోంది.


ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల కొందరి వ్యాపారాలు మందకొడిగా కొనసాగుతుండడంతో చందాలు అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈసారి బతుకమ్మతో తమ చందాల దందాకు తోడుగా పదవీయోగం పొందాలని కొందరు వర్గాల వారీగా తిరుగుతున్నారు. గత సంవత్సరం వరకూ ఒక పార్టీ బతుకమ్మ అని తిరిగిన వారు ఈసారి మరో పార్టీ బతుకమ్మ నిర్వాహకులుగా అవతారమెత్తడం ఆసక్తి కల్గిస్తోంది.

ఒక వైపు దుబాయిలో తెలిసిన కుటుంబాలను కలుస్తూ చందా అడగడంతో పాటు తమ బతుకమ్మకు రావల్సిందిగా హైదరాబాద్‌లో కూడా రెండు ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల వెంట తిరుగుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

UCSFకు డా.అంబటి శ్రీమన్నారాయణ రూ.10కోట్ల విరాళం

మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు తానా - పాఠశాల వేదికగా ఘన నివాళి

Updated Date - Oct 05 , 2026 | 02:43 PM