Share News

దుబాయిలో నూతన కాన్సుల్ జనరల్‌గా విష్ణు రాక

ABN , Publish Date - Aug 03 , 2026 | 09:14 PM

అత్యున్నత భారతీయ అధికారిగా నియమితులైన తెలుగు దౌత్యవేత్త డాక్టర్ ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి దుబాయికి చేరుకోవడంతో తెలుగు ప్రవాసీయులలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

దుబాయిలో నూతన కాన్సుల్ జనరల్‌గా విష్ణు రాక
Dr. Immadi Vishnuvardhan Reddy

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయి - భారత్ చరిత్రలో ప్రప్రథమంగా అత్యున్నత భారతీయ అధికారిగా నియమితులైన తెలుగు దౌత్యవేత్త డాక్టర్ ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి దుబాయికి చేరుకోవడంతో తెలుగు ప్రవాసీయులలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సందర్భంగా సోమవారం ఆయనను దుబాయిలోని తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు రసమయి అధ్యక్షుడు యస్‌వి రెడ్డి ఆధ్వర్యంలో కొందరు తెలుగు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. దుబాయి, ఉత్తర ఎమిరేట్స్‌లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సగటు కార్మికుల జీవనస్థితి గతులను వారు ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.


ఈ వార్తలనూ చదవండి:

ప్రవాసాంధ్ర టీడీపీ కార్యవర్గంలో బీసీలు, మహిళలకు పెద్దపీట

హైదరాబాద్‌లో ₹20 కోట్లతో ఎన్‌ఆర్‌ఐ భవన్: ఆటా వేడుకల్లో మంత్రి జూపల్లి

Updated Date - Aug 03 , 2026 | 09:18 PM