తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు
ABN , Publish Date - Sep 20 , 2026 | 08:41 PM
తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ (Telugu Association of Japan) ఆధ్వర్యంలో టోక్యోలోని ఓజిమా ప్రాంతంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో, భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించేలా ఘనంగా జరిగాయి.
టోక్యో, సెప్టెంబర్ 18, 2026: జపాన్‌లోని తెలుగు సమాజానికి అండగా నిలుస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ (Telugu Association of Japan) ఆధ్వర్యంలో టోక్యోలోని ఓజిమా ప్రాంతంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో, భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించేలా ఘనంగా జరిగాయి.
ఈ వేడుకల్లో తెలుగు కుటుంబాలతో పాటు స్థానిక జపాన్ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలను ఆసక్తిగా వీక్షించారు. భారతీయులు, జపాన్ స్థానికులు కలిసి వినాయక చవితిని జరుపుకోవడం రెండు సంస్కృతుల మధ్య స్నేహం, సాంస్కృతిక పరస్పర అవగాహనకు ప్రతీకగా నిలిచింది.

వినాయక చవితిని పురస్కరించుకుని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు. ‘ఎక్కడ ఉన్నా మన సంస్కృతి మనతోనే’ అనే భావనతో, జపాన్‌లోని తెలుగు కుటుంబాలు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను పరిచయం చేస్తూనే, స్థానిక జపాన్ సమాజం కలిసిపోయేలా ప్రోత్సహిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:
గల్ఫ్ దేశాలలో వినాయక చవితి, నిమజ్జన వేడుకలు
సౌదీ అరేబియాలో వైభవంగా తెలుగు భాషా దినోత్సవం