వెంకన్న భక్తులకు వైసీపీ క్షమాపణ చెప్పాలి: గల్ఫ్ టీడీపీ నేత
ABN , Publish Date - Feb 24 , 2026 | 10:17 PM
కల్తీ నెయ్యి ప్రసాదాల ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతకు భంగం కలిగించిన వైఎస్‌ఆర్‌సీపీ వెంటనే భక్తులకు క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా నాయకుడు వడ్లమూడి సారధి నాయుడు డిమాండ్ చేశారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కల్తీ నెయ్యి ప్రసాదాల ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతకు భంగం కలిగించిన వైఎస్‌ఆర్‌సీపీ వెంటనే భక్తులకు క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా నాయకుడు వడ్లమూడి సారథి నాయుడు డిమాండ్ చేశారు.
దైవభక్తి లేని వైఎస్‌ఆర్‌సీపీ శాసనమండలి సభ్యులు పెద్దల సభలో పాదరక్షలు ధరించి శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించడం క్షమించరాని నేరమని ఆయన అన్నారు. పాదరక్షలతో వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించిన తీరును సుమోటోగా స్వీకరించి చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.
తిరుపతి జిల్లాలో వేలాది మంది రైతులకు, కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న ఏకైక హెరిటేజ్ సంస్థ పైన నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తూ, హెరిటేజ్ సంస్థను దెబ్బతీయాలని చేస్తున్న ప్రయత్నాలను ఖండించాలని కూడా సారథి నాయుడు అన్నారు.
ఈ వార్తలూ చదవండి
ఒమాన్‌లో తెలుగు సామాజిక కార్యకర్తలకు రాయబారి అభినందన
ఆంధ్రా మహిళ మృతదేహాన్ని స్వదేశానికి తరలించిన గల్ఫ్ టీడీపీ కార్యకర్తలు