కువైత్‌లోని టీడీపీ కార్యకర్తకు అండగా తెలుగు తమ్ముళ్ళు
ABN , Publish Date - May 03 , 2026 | 03:10 PM
క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డ టీడీపీ కార్యకర్తకు కువైత్ పార్టీ నేతలు అండగా నిలిచారు. రూ.1.21 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ పక్షాన సామాజిక మాధ్యమాలలో క్రీయాశీలక పాత్ర వహించే వి. శ్రీశైలం అనేక కార్యకర్తకు కష్టకాలంలో కువైత్‌లోని తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది.
క్యాన్సర్ వ్యాధి బారిన పడి స్వదేశంలో వైద్య చికిత్స చేయించుకుంటున్న వి. శ్రీశైలంకు కువైత్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక లక్షా 21 వేల రూపాయాల ఆర్థిక సాయం చేశారని పార్టీ నాయకులు కుదరవల్లి సుధాకర్ రావు, మద్దిన ఈశ్వర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అధినేత యన్. చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ సందర్భంగా వేడుకలను నిర్వహించుకోవడానికి బదులుగా తాము పార్టీ కార్యకర్తకు ఈ రకంగా చేయూతనివ్వడం ద్వారా పార్టీ అధినేత సేవారీతిను ప్రతిబింబించినట్లుగా వారు పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వైభవంగా సెయింట్ మార్టినస్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
ఆస్ట్రేలియాలకు వలస వెళ్లిన వారిలో భారతీయులే టాప్