Share News

వైభవంగా సెయింట్ మార్టినస్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

ABN , Publish Date - May 02 , 2026 | 04:26 PM

ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో కరేబీయన్ దీవుల్లో నిర్వహిస్తున్న సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ(SMU) 2026 గ్రాడ్యుయేషన్ వేడుక ఘనంగా జరిగింది.

వైభవంగా సెయింట్ మార్టినస్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
SMU

  • 92% రెసిడెన్సీ మ్యాచ్ రేటు

  • ప్రైమ్ హెల్త్‌ కేర్‌తో భాగస్వామ్యం

  • ఏఐ ఆధారిత పాఠ్య ప్రణాళిక

ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో కరేబీయన్ దీవుల్లో నిర్వహిస్తున్న సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ(SMU) 2026 గ్రాడ్యుయేషన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం మూడు ముఖ్యమైన మైలురాళ్లను చేరుకున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. 92 శాతం రెసిడెన్సీ మ్యాచ్ రేటు సాధించినట్లు వెల్లడించారు. Prime Healthcare Servicesతో కొత్త భాగస్వామ్యం, వైద్య విద్యలో కృత్రిమ మేధస్సు(AI) వినియోగించనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రకటనలు వెలువరించారు.

3.jpg


బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ డా. హరనాథ్ పొలిచెర్ల మాట్లాడుతూ ఎస్ఎమ్‌యూ, ప్రైమ్ హెల్త్‌కేర్ సర్వీసెస్ మధ్య భాగస్వామ్యం ద్వారా అమెరికా ఆసుపత్రుల్లో క్లినికల్ ట్రైనింగ్ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. వైద్య రంగ భవిష్యత్తును ఏఐ ముందుకు నడిపిస్తోందని విద్యార్థులు తదుపరి తరానికి సిద్ధంగా ఉండేందుకు SMU పాఠ్య ప్రణాళికలో AIని చేర్చుతున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ అధ్యక్షుడు డా. మురళి గింజుపల్లి మాట్లాడుతూ 2026లో SMU 92 శాతం రెసిడెన్సీ మ్యాచ్ రేటు సాధించడం గొప్ప విజయమని చెప్పారు. డా. శ్రీరామ్ పూరేటి ఆధ్వర్యంలో స్వాగత కార్యక్రమం నిర్వహించారు. డా. సంజీవ్ కౌల్, చాన్సలర్ డా. సురేయ్యా సవాసన్, వైస్ చాన్సలర్ డా. డన్నా సోరియా, డీన్ ఆఫ్ క్లినికల్ సైన్సెస్ డా. బ్రాండన్ క్రౌట్ తమ సందేశాలను అందించారు. డా. రాఘవేంద్ర చౌదరి వేములపల్లి విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు.

4.jpg


బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ తాళ్లూరి జయశేఖర్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. బోర్డ్ సభ్యులు నిరంజన్ శృంగవరపు, సురేష్ పుట్టగుంట, కృష్ణ కుర్రా, ప్రకాశ్ గేరా, నవీన్ ఆలే, రాధిక కత్తరగడ్డ, ప్రముఖ కన్సల్టెంట్ డా. కమేంద్ర దేవిదాస్ దహత్, అలుమ్ని డా. గోపీ ములకా, డా. మోహిత్ శర్మ, డా. నౌషాద్ మన్సూరి, ప్రసాద్ బెతంచెర్ల, జోగేశ్వరరావు పెద్దిబోయిన, డా. సమ్హిత్ చంద్ర గింజుపల్లి, డా. పొలిచెర్ల విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

1.jpg

Updated Date - May 02 , 2026 | 05:57 PM