Share News

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కువైత్‌లో రక్తదాన శిబిరం

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:13 PM

కువైత్‌లో తెలుగు దేశం పార్టీ నాయకులు కుదరవల్లి సుధాకర్ రావు నేతృత్వంలో రక్తదాన కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కువైత్‌లో రక్తదాన శిబిరం
Telugu Desam Party Kuwait even

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు గల్ఫ్ దేశాల్లో ప్రారంభమయ్యాయి. కువైత్‌లో తెలుగు దేశం పార్టీ నాయకులు కుదరవల్లి సుధాకర్ రావు నేతృత్వంలో రక్తదాన కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

మూడు రోజుల పాటు జరిగిన రక్తదాన కార్యక్రమంలో పార్టీ అభిమానులు రెండు వివిధ ఆసుపత్రులలో రక్తదానం చేశారు. రక్తదానం చేసిన దాతలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు సంతకంతో కూడిన ప్రశంసా పత్రాలను ఇచ్చారని సుధాకర్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వహణలో తెలుగుదేశం పార్టీ నాయకులు బిల్లా రమేశ్, ముద్దిన ఈశ్వర్ నాయుడులు కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు.

2.jpg


రక్తదాన కార్యక్రమం నిర్వహణలో షేక్ బాషా, దుర్గాప్రసాద్ ఈడుపుగంటి, వి.సి.సుబ్బారెడ్డిలతో పాటు తెలుగుదేశం నాయకురాలు రషీదా బేగం, ఖాదరున్, కొల్లి ఆంజనేయులు, వేణురాజు, సాయి, రాహుల్, రామరాజు, పోసు రాజు, వేణుగోపాల్ స్వామి, జనసేన నాయకులు కంచన శ్రీకాంత్, ఆంజన కుమార్ పగడాల, రామచంద్ర నాయక్, ఆకుల రాజేష్, ఇమ్మిడిసెట్టి సూర్యనారాయణ, జగిలి ఓబులేష్, తదితరులు పాల్గొన్నట్లుగా సుధాకర్ రావు చెప్పారు.

3.jpg


ఈ వార్తలూ చదవండి:

దుబాయిలో రూ.35 లక్షల ఆసుపత్రి బిల్లు మాఫీ చేయించిన జనసేన

తానా - పాఠశాల ఆధ్వర్యంలో ‘ప్రాగ్దిశ వీణియపై - మయూఖ తంత్రులమై’

Updated Date - Mar 29 , 2026 | 10:23 PM