గల్ఫ్ దేశాల్లో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాలు
ABN , Publish Date - Mar 30 , 2026 | 06:40 PM
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాలను గల్ఫ్ దేశాలలో పార్టీ అభిమానులు, ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఆనందోత్సాహాల జరుపుకున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాలను గల్ఫ్ దేశాలలో పార్టీ అభిమానులు, ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఆనందోత్సాహాల జరుపుకున్నారు.
గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధకృష్ణా అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు, పార్టీ ఎన్నారై అధ్యక్షుడు, ఏపీ ఎన్నార్టీ ఛైర్మన్ వేమూరి రవి, బ్రహ్మణ పరిషత్ ఛైర్మన్ కె. బుచ్చిరాం ప్రసాద్‌లు వీడియో కాల్ ద్వారా గల్ఫ్‌లోని వివిధ దేశాలలోని తెలుగుదేశం అభిమానులతో మాట్లాడారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. గల్ఫ్ దేశాలలో పార్టీ కార్యకలాపాలను రాధాకృష్ణా వివరించారు. సామాన్య ప్రవాసీయుల సాధకబాధకాలను పరిష్కరించే దిశగా తెలుగుదేశం పార్టీ చేసిన విప్లవాత్మక మార్పులను ఏపీ ఎన్నార్టీ డైరెక్టర్ అక్కిలి నాగేంద్రబాబు వివరించారు.
సౌదీ అరేబియాలో ...
గల్ఫ్‌లో అతి పెద్ద దేశమైన సౌదీ అరేబియాలో పార్టీ అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా ఆధ్వర్యంలో రాజధాని రియాద్, పారిశ్రామిక నగరం జుబైల్‌లలో కార్యక్రమాలను నిర్వహించారు. రియాధ్‌లో పార్టీ నాయకులు జానీబాషా షేఖ్, చెన్నుపాటి రాజశేఖర్‌ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సారధి నాయుడు వడ్లమూడి, భవానీ శంకర్, శిల్పా గడ్డం, అక్షిత చెన్నుపాటి, సుచరిత, నరేశ్ చెన్నుపాటి, జయలక్ష్మి సుగవాసి, నవీన్ గుండు, ఆనంద్ దాడి, అర్చన, శ్రీనివాస్ బలుసు, రంజీత్, సతీష్, శ్వేత తదితరులు పాల్గొన్నారు. దేశంలో ప్రప్రథమంగా మహిళా సాధికారతను అమలు చేసి చూపించిన విధానాన్ని జయలక్ష్మి, సుచరితలు వివరించారు.
పారిశ్రామిక నగరం జుబైల్‌లో భరద్వాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చంద్రశేఖర్, శ్రీనివాస్ కొగంటి తదితరుల సమన్వయంతో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భరద్వాజ్, చంద్రశేఖర్‌లు పార్టీ కార్యక్రమాలను వివరించారు.
బహ్రెయిన్‌లో..
నిరంతర ఇరాన్ దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్న బహ్రెయిన్‌లో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉత్సాహంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. హరిబాబు, మోహన్, సతీష్ శెట్టి, సతీష్ బొల్లాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
ఖతర్‌లో..
ఖతర్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో యలమంచిలి శాంతయ్య నివాసంలో జరిగిన కార్యక్రమంలో నార్నే కళ్యాణ్, మలిరెడ్డి సత్యనారాయణలు పార్టీ చరిత్రను వివరించారు. గాలి కవీంద్ర, మాదినేని అంజనేయులు, కిరణ్, కనగాల శ్రీనివాస్, బొండలపాటి విజయ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రక్తదానం శిబిరాన్ని నిర్వహించామని కూడా రమణ తెలిపారు.
నరేశ్ మద్దిపోటీ నేతృత్వంలో అల్ ఖోర్‌లో మరో కార్యక్రమంలో అభిమానులు కేక్ కట్ చేశారు. ఇందులో పార్టీ నాయకులు రవి ప్రసంగిస్తూ పార్టీ వైభవాన్ని వివరించారు. రామరావు, విక్రమ్, మల్లేశ్వరరావవు తదితరులు పాల్గొన్నారు.

కువైత్‌లో..
కువైత్‌లో నాయకులు వెంకట్ కోడూరి, కుదరవల్లి సుధాకర్ రావుల నేతృత్వంలో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాలల్లో పార్టీ అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈశ్వర్ నాయుడు, దివాకర్, ముస్తాక్, సురేశ్ మాలపాటి, బెజవాడ నగేశ్, రవి మలిశెట్టి, రషీదా బేగంలు ప్రసంగించారు.
ఒమాన్‌లో..
ఒమాన్‌లో జరిగిన కార్యక్రమంలో సత్య శ్రీధర్, కంతేటి రాఘవేంద్ర, అనిల్ నాగిడి, రామచంద్ర రావు బొల్లినలు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలను వివరించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో..
తెలుగుదేశం పార్టీ దుబాయిలో నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో పార్టీ నాయకులు విశ్వేశ్వరరావు మోతుకూరి, తులసి కుమార్ ముక్కు, సునిల్ బోయపాటి, సాహుల్ సూర్యదేవర, రాజా రవి, ప్రసాద్ దారపనేని, సురేంద్ర బెజవాడ, తౌహీద్ షేక్‌లు పాల్గొన్నారు.
ఈ వార్తలూ చదవండి:
దుబాయిలో రూ.9 లక్షల ఆసుపత్రి బిల్లు మాఫీ చేయించిన జనసేన
తానా - పాఠశాల ఆధ్వర్యంలో ‘ప్రాగ్దిశ వీణియపై - మయూఖ తంత్రులమై’