బే ఏరియాలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం
ABN , Publish Date - Mar 30 , 2026 | 07:15 PM
బే ఏరియా మిల్పిటాస్ పట్టణంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం అనే పునాదులపై తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుందని ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరామ్, గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు.
బే ఏరియా మిల్పిటాస్ పట్టణంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోమటి జయరాం జూమ్ కాల్ ద్వారా మాట్లాడారు. ‘టీడీపీ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అనేక మార్పులు తీసుకొని వచ్చింది. సమాజంలో ఉన్న రాజకీయ అసమానతలను తొలగించి బడుగు, బలహీన వర్గాల వారికీ రాజ్యాధికారం దక్కేలా చేసింది. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీని చంద్రబాబు, లోకేష్ సమర్థవంతంగా నడిపిస్తున్నారు. కొంగొత్త రాజకీయ ఆవిష్కరణలకు నూతన సంస్కరణలకు తెలుగుదేశం పార్టీ ఒక ప్రయోగశాల’ అని జయరాం అన్నారు.

గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ 24 ఏళ్ళు అధికారంలో, 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉందని అన్నారు. ఈ 44 ఏళ్ల ప్రయాణంలో ప్రజల పక్షానే నిలిచి అనేక ఉద్యమాలు చేసిందని పేర్కొన్నారు.
వెంకట్ కోగంటి మాట్లాడుతూ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చి ఆంధ్రప్రదేశ్‌కు సీఎం చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని తెలిపారు. చంద్రబాబు తెచ్చిన ఐటీ విప్లవం వల్లే తాము అమెరికాలో ఈ స్థాయిలో ఉన్నామన్నారు.
ఈ కార్యక్రమాన్ని రాజశేఖర్ పర్వతనేని సమన్వయ పరిచారు. ఈ కార్యక్రమంలో విజయ్ గుమ్మడి, శ్రీకాంత్ దొడ్డపనేని, శ్రీనివాసు తడపనేని, విజయ్ జెట్టి, వెంకట్ అడుసుమల్లి, సుబ్బా యంత్ర, రమేష్ మల్లారపు, రవి అడుసుమల్లి, హరి సన్నిధి, భాస్కర్ మొలకలపల్లి, రవి కిరణ్, ఎంవీరావు, భరత్ ముప్పీరాల, గాంధీ పాపినేని, శివ గుమ్మడి, జగదీష్ గింజుపల్లి, రామ్ తోట, శ్రీనివాస్ వల్లూరుపల్లి, సురేష్ పోతినేని, భాస్కర్ అన్నే, వాసు బండ్ల, రాజా కొల్లి, సీతారాం కోడలి, చంద్ర గుంటుపల్లి, శ్రీనివాసు పతకమూరి తదితరులు పాల్గొన్నారు.





ఈ వార్తలూ చదవండి:
ప్రవాస భారతీయులకు వంశీ పురస్కారాలు
తానా - పాఠశాల ఆధ్వర్యంలో ‘ప్రాగ్దిశ వీణియపై - మయూఖ తంత్రులమై’