Share News

ఛార్లెట్‌లో తానా 5కే రన్‌కు భారీ స్పందన

ABN , Publish Date - Sep 21 , 2026 | 09:21 PM

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలోని ఛార్లెట్‌లో తానా టీమ్ స్క్వేర్ విభాగం నిర్వహించిన 5కే రన్ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది.

ఛార్లెట్‌లో తానా 5కే రన్‌కు భారీ స్పందన
TANA 5K Run

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలోని ఛార్లెట్‌లో తానా టీమ్ స్క్వేర్ విభాగం నిర్వహించిన 5కే రన్ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. దాదాపు 400 మందికిపైగా పిల్లలు, పెద్దలు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సెప్టెంబర్ 20, ఆదివారం ఉదయం ఫ్రాంక్ లిస్కే పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి తానా నాయకులు పలువురు హాజరయ్యారు. వచ్చినవారికి రుచికరమైన దక్షిణ భారత అల్పాహారం అందించారు. ఉచిత టీ షర్టులు, విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. తానా టీమ్ స్క్వేర్ నిధుల సేకరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. తానా 5కే రన్‌కు జాతీయ స్థాయి స్పాన్సర్‌గా Xpat వ్యవహరించింది.

1.jpg


తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, జాయింట్ ట్రెజరర్ రాజేష్ యార్లగడ్డ, ఫౌండేషన్ ట్రస్టీ మధుకర్ యార్లగడ్డ, సౌత్ ఈస్ట్ ప్రాంతీయ ప్రతినిధి శేఖర్ కొల్లు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తానా నాయకులు మాట్లాడుతూ, తానా టీమ్ స్క్వేర్ నిధుల సేకరణలో భాగంగా మొదటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించామని చెప్పారు. అదే విధంగా ఇతర నగరాల్లో కూడా నిర్వహిస్తామన్నారు. తానా టీమ్‌స్క్వేర్ ద్వారా చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించారు.

ఈ కార్యక్రమానికి యాంకర్‌గా సౌమ్యశ్రీ తలంకి వ్యవహరించారు. జూంబా ఇన్‌స్ట్రక్టర్ మౌనిక కావలి కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మార్గదర్శకులుగా మారథాన్‌ రన్నర్‌, తానా కమ్యూనిటీ సర్వీస్‌ అవార్డు గ్రహీత అయిన నవీన్‌ అప్పలనేని వ్యవహరించారు. ఆయన అంకితభావం, నాయకత్వం అందరికీ మార్గదర్శనంగా నిలిచింది.

2.jpg


తానా ఛార్లెట్ నాయకులు తానా టీమ్‌ స్క్వేర్‌ చైర్మన్‌ కిరణ్‌ కొత్తపల్లి, తానా అప్పలాచియాన్ ప్రాంతీయ ప్రతినిధి రవి (నాని) వడ్లమూడి, స్పెషల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి, హెల్త్ సర్వీసెస్‌ కోఆర్డినేటర్ మాధురి ఏలూరి, ఫౌండేషన్ ట్రస్టీ ఠాగూర్ మల్లినేని, పట్టాభి కంఠంనేని తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేశారు. రన్‌ తర్వాత జరిగిన సమావేశంలో తానా నాయకులు మాట్లాడారు. తానా టీమ్‌ స్క్వేర్‌ ద్వారా తానా చేస్తున్న సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ, వాలంటీర్లకు, స్పాన్సర్లకు తానా నాయకులు ధన్యవాదాలు తెలిపారు.

3.jpg7.jpg6.jpg5.jpg


ఈ వార్తలనూ చదవండి:

తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు

ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్న గ్లోబల్ తెలంగాణ సంఘం

Updated Date - Sep 21 , 2026 | 09:24 PM