Share News

ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్న గ్లోబల్ తెలంగాణ సంఘం

ABN , Publish Date - Sep 20 , 2026 | 07:47 PM

టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరంలో శనివారం గ్లోబల్ తెలంగాణ సంఘం బోర్డు సమావేశం జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్న గ్లోబల్ తెలంగాణ సంఘం
Global Telangana Association

టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరంలో శనివారం గ్లోబల్ తెలంగాణ సంఘం బోర్డు సమావేశం జరిగింది. సంస్థ విభాగాలను 100 దేశాలకు విస్తరించాలని లక్ష్యంగా నిర్ణయించామని వ్యవస్థాపక ఛైర్మన్ కలవాల విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. 2023లో స్థాపించిన గ్లోబల్ తెలంగాణ సంఘానికి (జీటీఏ) ప్రస్తుతం 54 దేశాల్లో శాఖలు ఉన్నాయి.

Global Telangana.jpg


జన్మభూమికి కర్మభూమికి మధ్య వారధిగా సంస్థ ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని కలవాల విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. స్థానికంగా ఉన్న తెలంగాణ ఎన్నారైలను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. ప్రపంచ దేశాల్లో తెలంగాణ ప్రవాసులు ఎక్కడ ఉంటే అక్కడ జీటీఏ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. బోర్డు సమావేశానికి ఫ్రిస్కో నగర మేయర్ మార్క్ హిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తున్న జీటీఏను ఆయన అభినందించారు. సాయంకాలం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీటీఏ డాలస్ విభాగ నాయకత్వాన్ని ప్రకటించారు. స్థానిక ప్రవాసుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

GTS3.jpg


కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ కేశిరెడ్డి ప్రవీణ్, అధ్యక్షుడు కేతిరెడ్డి బాపురెడ్డి, ఉపాధ్యక్షులు ప్రవీణ్ బిల్లా, మధు, ప్రవీణ్‌కుమార్, తదుపరి అధ్యక్షుడు రవీందర్ గడ్డంపల్లి, ఈసీ సభ్యులు దుషంత్ రెడ్డి, హరి, సుధీర్, వంశీ, BOTలు అమర్, అరుణ్, బిందు, కోట్య, కృష్ణ, మహేష్, మన్మోహన్, మోహన్, నరసింహారెడ్డి, ప్రవీణ్, ప్రేమ్, రఘు, రాజేందర్, సుమ, సురేందర్, సుశాంత్, విజయ్, డాలస్ నుండి సందీప్ జంబుల, సంతోష్ చెరుకు, కిరణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

GTS4.jpgGTS5.jpg


ఈ వార్తలనూ చదవండి:

గల్ఫ్ దేశాలలో వినాయక చవితి, నిమజ్జన వేడుకలు

సౌదీ అరేబియాలో వైభవంగా తెలుగు భాషా దినోత్సవం

Updated Date - Sep 20 , 2026 | 07:56 PM