Share News

మధుర క్షణాలను గుర్తు చేసిన తానా మిడ్-అట్లాంటిక్ ‘నాన్నతో నడక’

ABN , Publish Date - Jun 25 , 2026 | 09:19 PM

ఫాదర్స్ డేను పురస్కరించుకుని తానా మిడ్ అట్లాంటిక్ సంఘం నాన్నతో నడక ఈవెంట్‌ను జూన్ 21న, పెన్సిల్వేనియాలోని వ్యాలీ ఫోర్జ్ నేషనల్ హిస్టారికల్ పార్క్‌లో నిర్వహించింది.

మధుర క్షణాలను గుర్తు చేసిన తానా మిడ్-అట్లాంటిక్ ‘నాన్నతో నడక’
TANA Mid-Atlanti Father's Day Event

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో మరో మధురమైన కార్యక్రమం నాన్నతో నడక. ఫాదర్స్ డేను పురస్కరించుకుని తానా మిడ్ అట్లాంటిక్ సంఘం ఈ వేడుకను జూన్ 21న, పెన్సిల్వేనియాలోని వ్యాలీ ఫోర్జ్ నేషనల్ హిస్టారికల్ పార్క్‌లో నిర్వహించింది.

తానా మిడ్ అట్లాంటిక్ నిర్వహించిన 40వ వేడుక ఇది. జూలై 2025 నుంచి వరుసగా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. నాన్నతో నడక పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి నాన్నగారితో తాము గడిపిన మధురక్షణాలను గుర్తుకు తెచ్చేలా సాగింది.

TANA Mid 7.jpg

ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటిలతో పాటు, ఈ కార్యక్రమానికి సూచనలు, మార్గదర్శకత్వం చేసిన తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి మరో ముఖ్య ఆకర్షణగా ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ నిలిచారు. ఆయన ముఖ్య అతిథిగా విచ్చేయడంతో ఈ వేడుక మరింత ప్రత్యేకంగా, చిరస్మరణీయంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో నాన్న ఎలాంటి కీలకమైన పాత్ర పోషించే వారో ఆయన తన మాటలతో తెలియజేశారు. స్ఫూర్తిదాయకమైన ఆయన ప్రసంగం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఆయన వచ్చిన తండ్రులతో, పిల్లలతో కలిసి ఫోటోలు దిగటం అందరినీ ఆకర్షించింది.

TANA Mid 3.jpg


ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా మారుస్తూ మిమిక్రీ రమేష్ తన పాటలు, ప్రదర్శనలతో అలరించారు. మఖ్దూమ్ సయ్యద్, ఉమాకాంత్ గారి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు కూడా వేడుకకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో దాదాపు 200 మందికి పైగా తండ్రులు, వారి పిల్లలు ఉత్సాహంగా పాలొన్నారు. ఈ కార్యక్రమ విజయవంతానికి ఎంతో కృషి చేసిన సురేష్ యలమంచికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విలువైన సహకారాన్ని అందించిన సునీల్ కోగంటి, రంజిత్ మామిడి, శ్రీధర్ సాదినేని, దీప్తి కోక, సంతోష్ రౌతు, చలం పావులూరి, కృష్ణ నందమూరి, విశ్వనాథ్ కోగంటి, మరియు ప్రసాద్ కస్తూరిలకి ప్రత్యేక ధన్యవాదాలు.

ఈవెంట్ కోసం అంకితభావంతో పనిచేసిన వాలంటీర్లందరికీ ‘వాలంటీర్ సర్వీస్ అవర్ సర్టిఫికేట్లు’ పంపిణీ చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ మధ్యాహ్న భోజన వసతి కల్పించి, ఈ వేడుకను అందరికీ ఒక మధురమైన అనుభూతిగా మార్చారు.

TANA Mid.jpgTANA Mid 4.jpgTANA Mid 2.jpgTANA Mid 5.jpg


ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో వైభవంగా ముగిసిన మాటా మహాసభలు

డాలస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

Updated Date - Jun 25 , 2026 | 10:12 PM