Share News

టోరంటోలో ఘనంగా జరిగిన తాకా ఉగాది సంబరాలు

ABN , Publish Date - Mar 26 , 2026 | 09:04 AM

తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా (TACA) ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుక మార్చి 21న టోరంటోలో వైభవంగా జరిగింది.

టోరంటోలో ఘనంగా జరిగిన తాకా ఉగాది సంబరాలు
TACA Ugadi-2026

ఇంటర్నెట్ డెస్క్: టోరంటోలోని తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా (TACA) ఆధ్వర్యంలో తెలుగు నూతన సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు మార్చి 21న టోరంటో పెవిలియన్‌లో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది హాజరై తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఉత్సాహంగా వేడుకను జరుపుకున్నారు. టోరంటోలోని భారత కాన్సులేట్‌కు చెందిన కాన్సుల్ అరుణ్ కుమార్ (IFS) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సంస్థ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున చారి అతిథులందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం, వేద పండితులు మంజునాథ్ శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం నిర్వహించారు. వివిధ రాశుల వారికి ఈ సంవత్సరంలో గ్రహాల స్థితి (గ్రహచారం) వల్ల కలిగే శుభాశుభ ఫలితాలు,

ఆదాయ-వ్యయాలను వివరించారు. అందరికీ శుభములు కలగాలని భగవంతుని ప్రార్థించారు. వంద మందికి పైగా కళాకారులు వేదికపై అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు అందిస్తూ ఐదు గంటలకు పైగా ప్రేక్షకులను అలరించారు. ఈ ప్రదర్శనలలో పాల్గొన్న ప్రతిభావంతులందరినీ ప్రౌడ్ స్పాన్సర్స్ మెమెంటోలతో తాకా సత్కరించింది. అతిథులు రుచికరమైన తెలుగు వంటకాలను ఆస్వాదించగా, ముఖ్యంగా నేతి బూరెలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.

5.jpg


2026 సంవత్సరానికి గ్రాండ్ స్పాన్సర్లైన ప్రవీణ్ చిమట (రియల్టర్), గౌతమ్ కొల్లూరితో (IRCC లాయర్ అండ్ ఏఎమ్‌పీ; అంతర్జాతీయ విద్యార్థుల కౌన్సిలర్) పాటూ, స్పాన్సర్లు అందరికీ తాకా గవర్నింగ్ బోర్డు కృతజ్ఞతలు తెలియజేసింది. తాకా అధ్యక్షులు ప్రసన్న తిరుచిరాపల్లి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తాకా ఆశయాలకు అనుగుణంగా మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను మరింత విస్తరించేలా రాబోయే కార్యక్రమాల్లో పాల్గొని వాటిని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

తాకా అధ్యక్షులు ప్రసన్న తిరుచిరాపల్లి, ఉపాధ్యక్షురాలు వాణి జయంతి, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున చారి, కోశాధికారి ప్రదీప్ రెడ్డి, డైరెక్టర్లు అశ్విత, ప్రశాంతి, యశ్వంత్, కళ్యాణ్, ఎఫ్‌సీ ఛైర్ చారి సామంతపూడి, బీఓటీ ఛైర్ కల్పన మోటూరి, ట్రస్టీలు అనిత సజ్జ, ప్రవీణ్ పెనుబాక, పవన్ కుమార్ బసాని, ఆదిత్య వర్మ, మాజీ అధ్యక్షులు, వ్యవస్థాపక సభ్యులు రమేష్ మునుకుంట్ల, సంస్థాపక సభ్యులు రామ్ దుగ్గిన, మునాఫ్ అబ్దుల్, అరుణ్ కుమార్ లయం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తాకా ఉగాది ఉత్సవాలు 2026 టోరంటో తెలుగు సమాజానికి మరపురాని పండుగగా నిలిచాయి.

1.jpg2.jpg4.jpg


ఈ వార్తలూ చదవండి:

ఈసారి హెచ్-1బీ దరఖాస్తులు సగానికి పడిపోయే ఛాన్స్

ఒమాన్‌లో శ్రీ రాజ రాజేశ్వరస్వామి కల్యాణోత్సవం

Updated Date - Mar 26 , 2026 | 12:05 PM