Share News

న్యూయార్క్‌లో పంజాబ్ యువకుడి దారుణ హత్య.. పిజ్జా డెలివరీ చేస్తుండగా..

ABN , Publish Date - Aug 23 , 2026 | 01:32 PM

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పిజ్జా డెలివరీ చేస్తూ పంజాబ్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడు గురుదీప్ సింగ్ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

న్యూయార్క్‌లో పంజాబ్ యువకుడి దారుణ హత్య.. పిజ్జా డెలివరీ చేస్తుండగా..
Punjab man shot dead in New York

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పిజ్జా డెలివరీ చేస్తూ పంజాబ్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడు గురుదీప్ సింగ్ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ విషాద ఘటనతో పంజాబ్‌లోని అతడి స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కాల్పులకు అసలు కారణం ఏమిటన్న దాని గురించి న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు (Punjab man shot dead in New York).


పంజాబ్‌లోని కపుర్తలా జిల్లా జబ్బోవాల్ గ్రామానికి చెందిన గురుదీప్ సింగ్ సుమారు 13 ఏళ్ల క్రితం అప్పు చేసి అమెరికాకు వెళ్లాడు. కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు తల్లిదండ్రులకు మెరుగైన జీవితం అందించాలనే ఆశతో అమెరికాలో అడుగుపెట్టాడు. అమెరికాకు వెళ్లిన తర్వాత కూడా గురుదీప్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. కుటుంబ భవిష్యత్తు కోసం పగలు, రాత్రి కష్టపడి పనిచేసేవాడని అతడి తండ్రి తెలిపారు (New York shooting).


గురుదీప్ న్యూయార్క్ నగరంలో పిజ్జా డెలివరీ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు (Indian man killed in US). గురుదీప్ మరణవార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గురుదీప్‌నకు తండ్రి ప్యారా లాల్, సోదరుడు ఉన్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే గురుదీప్ హత్యకు కారణమైన వ్యక్తిని త్వరగా అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని అమెరికా అధికారులకు విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి..

ఒడిశా తీరానికి సమీపంలో కార్గో నౌక మునక.. 22 మంది గల్లంతు..


ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 23 , 2026 | 01:34 PM