Share News

పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం.. కువైత్‌లో చురుగ్గా ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం సభ్యుల నమోదు

ABN , Publish Date - Aug 23 , 2026 | 08:50 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న పేద ప్రవాసాంధ్రులకు ఉచిత ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని వర్తింపజేయడానికి జనసేన నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం.. కువైత్‌లో చురుగ్గా ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం సభ్యుల నమోదు
Pravasi Andhra Bharosa insurance

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న పేద ప్రవాసాంధ్రులకు ఉచిత ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని వర్తింపజేయడానికి జనసేన నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.

జన్మదినోత్సవమైన సెప్టెంబర్ 2కు ముందు గల్ఫ్‌లోని ఆరు దేశాల్లో మొత్తం 5 వేల మందిని ఈ పథకంలో చేర్పించాలనే లక్ష్యంతో జనసైనికులు ముందుకు కదులుతున్నారు.

ఇందులో భాగంగా కువైత్‌లో ఈ కార్యక్రమం ఊపందుకుంది. జనసేన నాయకులు, ఏపీ ఎన్నార్టీ ప్రతినిధులు కంచన శ్రీకాంత్, ఫణీంద్రల ఆధ్వర్యంలో శనివారం మహుబులా ప్రాంతంలో బీమా నమోదు శిబిరాన్ని నిర్వహించారు.

ఏపీ ఎన్నార్టీ సంస్థ సేవా కార్యక్రమాలు, ఇందులో సభ్యత్వం తీసుకోవడంతో పాటు ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం వలన కలిగే ప్రయోజనాలను వివరించామని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.


చిన్నాచితకా పనులు చేసుకునే 100 మందిని ఈ బీమా పథకంలో నమోదు చేయిస్తామని వారు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవిది 71వ జన్మదినోత్సవం కావడంతో కడప జిల్లా నందలూరుకు చెందిన కృష్ణంరాజు మరో 71 మంది స్వల్ప ఆదాయం కల్గిన ప్రవాసీయులకు బీమా పథకానికి ప్రీమియం చెల్లించడానికి ముందుకు వచ్చారని వారు చెప్పారు.

ఈ కార్యక్రమంలో గల్ఫ్ జనసేన నాయకులు ఆకుల రాజేష్, బిరదా సూర్యనారాయణ, ఇమ్మిడిశెట్టి సూర్య పాల్గొనగా, బలరామ్ నాయుడు, కృష్ణంరాజు, గున్నం శ్రీనివాస్ తదితరులు హాజరై ప్రవాసాంధ్ర భరోసా బీమా ముఖ్యాంశాలను వివరించారు.

కువైత్ దేశంలో తాము కనీసం 1500 మందిని ఈ పథకంలో చేర్పించే లక్ష్యంగా పని చేస్తున్నామని, ఇప్పటి వరకూ 1000కు పైగా జనాల పేర్లను నమోదు చేసిట్లుగా జనసేన నాయకుడు, ఏపీ ఎన్నార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ కంచన శ్రీకాంత్ పేర్కొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

న్యూయార్క్‌లో పంజాబ్ యువకుడి దారుణ హత్య.. పిజ్జా డెలివరీ చేస్తుండగా..

ఏపీలో పెట్టుబడులకు అమెరికా ఐటీ పారిశ్రామికవేత్తలకు APTS ఛైర్మన్ మోహన కృష్ణ పిలుపు

Updated Date - Aug 23 , 2026 | 09:13 PM