Share News

ఇంజనీరింగ్ విద్యార్థినికి రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేసిన ఎన్ఆర్ఐ రవి పొట్లూరి

ABN , Publish Date - Nov 16 , 2026 | 09:08 PM

ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు అండగా నిలుస్తూ ప్రముఖ ఎన్ఆర్ఐ, దాత రవి పొట్లూరి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు.

ఇంజనీరింగ్ విద్యార్థినికి రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేసిన ఎన్ఆర్ఐ రవి పొట్లూరి
Ravi Potluri's Financial Aid to Student

ఇంటర్నెట్ డెస్క్: ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు అండగా నిలుస్తూ ప్రముఖ ఎన్ఆర్ఐ, దాత రవి పొట్లూరి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. ఇంజనీరింగ్ 3వ సంవత్సరం (థర్డ్ ఇయర్) చదువుతున్న విద్యార్థిని సి. శ్రావణి విద్యాభ్యాసం కోసం ఆయన రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.


ఈ ఆర్థిక సాయాన్ని పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ప్రముఖ నాయకులు గౌరు వెంకటరెడ్డి చేతుల మీదుగా విద్యార్థిని శ్రావణికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో రవి పొట్లూరి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని చదువులో మరింత రాణించాలని విద్యార్థినికి సూచించారు. తన చదువుకు అండగా నిలిచిన రవి పొట్లూరికి, సహాయాన్ని అందించిన గౌరు దంపతులకు విద్యార్థిని శ్రావణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.


ఈ వార్తలనూ చదవండి:

బహ్రెయిన్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం

రియాధ్‌లో ఆదివాసీ దినోత్సవం

Updated Date - Nov 16 , 2026 | 09:08 PM